
పెయ్య దూడల ప్రదర్శన
గుడిపాల : మండలంలోని బొమ్మసముద్రంలో బుధవారం సంకరజాతి పెయ్యదూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు పశుసంవర్ధకశాఖ వైద్యాధికారులు సుబ్బారావు, సాయిసుధ, రవితేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెయ్య దూడల్లో జెర్సీ జాతి ఆవులను అభివృద్ధి చేయడం వల్ల పాలదిగుబడి పెరుగుతుందన్నారు. దీంతో పాటు ఇక్కడ వాతావరణానికి జెర్సీ ఆవులు అనుకూలంగా ఉంటుందన్నారు. హెచ్‌ఎఫ్ ఆవులు వేసవి సరిగ్గా తట్టుకోలేని పరిస్థితులు ఎదురవ్వడంతో పాటు పాలరేట్లు కూడా సరిగ్గా రావని తెలియజేశారు. అనంతరం 92 దూడలు ప్రదర్శనకు రావడం జరిగింది. ఇందులో ముగ్గురికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది జ్ఞానశ్రీ, అబ్దుల్లా, సంగీత, కిషోర్, తులసి, శివకుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.