
బోయకొండకు పోటెత్తిన భక్తులు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జామున 5 నుంచి సాయంత్రం 6 గంటలవరకు భక్తులతో కొండ కిక్కిరిసింది. గంగమ్మను విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మహిళలు పిండి, నూనె దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 40 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. భారీగా వాహనాలు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినట్లు వెల్లడించారు.
ఒక్క రోజు ఆదాయం రూ.22.42 లక్షలు
బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం ఒక్కరోజు మాత్రమే రూ:22.42లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. వివిధ రకాల సేవా టికెట్లు, ప్రసాదం, తీర్థం టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. అలాగే నంద్యాలకు చెందిన పారెస్ట్ రేంజర్ పి. ఈశ్వరయ్య, మహేశ్వరమ్మ దంపతులు గోశాల నిర్వహణకు రూ.69,200 విరాళం అందజేసినట్లు వివరించారు. దాతలకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించినట్లు తెలిపారు.

బోయకొండకు పోటెత్తిన భక్తులు