● అబ్కారీ అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు ● నెలవారి మామూళ్లు పెంచాలని పలుచోట్ల హుకుం ● తమ ఆదాయంలో తగ్గించుకోవడంపై ‘ఎకై ్సజ్‌’ ● జిల్లాను వదలి.. పక్క జిల్లాల వైపు చూస్తున్న అధికారులు | - | Sakshi
Sakshi News home page

● అబ్కారీ అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు ● నెలవారి మామూళ్లు పెంచాలని పలుచోట్ల హుకుం ● తమ ఆదాయంలో తగ్గించుకోవడంపై ‘ఎకై ్సజ్‌’ ● జిల్లాను వదలి.. పక్క జిల్లాల వైపు చూస్తున్న అధికారులు

Jul 22 2025 7:49 AM | Updated on Jul 22 2025 8:16 AM

● అబ్కారీ అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు ● నెలవారి మామ

● అబ్కారీ అధికారులపై కూటమి నేతల ఒత్తిళ్లు ● నెలవారి మామ

చిత్తూరు అర్బన్‌: ‘కరవమంటే కప్పకి కోపం..విడవమంటే పాముకి కోపం’ అన్నట్లు తయారైంది జిల్లా లోని ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ అధికారుల పరిస్థితి. ఓ వైపు నెలవారి మామూళ్లు పెంచమని కూటమి నేతలు.. ఇస్తే ఇచ్చుకోండి, కానీ మాకు ఇచ్చేదాంట్లో మాత్రం చెయ్యి పెట్టొద్దంటూ ఓ అధికారి నుంచి ఆదేశాలు అందడంతో పలువురు సీఐలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ప్రైవేటు దుకాణాల ద్వారా ఏరులైపారుతున్న మద్యం ప్రవాహంలో ఎవరికి కావాల్సినంత వాళ్లు యథేచ్ఛగా దోచుకుంటున్నారు.

దొందూ దొందే

అధికారులు వసూలు చేసి ఇస్తున్న మామూళ్లలో పబ్బం గడుపుకుంటున్న కొందరు నేతలు ఉన్నట్టుండి తమ వాటా పెంచాలని కోరడం.. అధికారులకు మింగుడుపడడం లేదు. కింది స్థాయిలో నెలవారీ మామూ ళ్లు చేసే అధికారులు, ఈ మొత్తం నుంచి అందరికీ పంచిపెట్టి చివర్లో మిగిలిన చిల్లర జేబుల్లో వేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇటీవల చిత్తూరులోని ఓ ఉన్నతాధి కారి వద్ద దీనిపై పంచాయితీ జరిగినట్లు తెలిసింది. ఆయన తనకిచ్చే నెలవారీ మామూళ్ల నుంచి రూపా యి తగ్గించుకున్నా ఒప్పుకునేదిలేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కావాలంటే నేతలకు ఇచ్చే దాంట్లో తగ్గించుకోమని సలహా ఇచ్చినట్లు తెలిసింది.

ఇమడలేక ‘ఎకై ్సజ్‌’

ఓ వైపు సొంత శాఖలోని అధికారులు, మరో వైపు నేత లు సతాయిస్తుండడంతో నాలుగు సర్కిళ్ల నుంచి సీఐ లు, ఓ ఉన్నతాధికారి జిల్లాను వీడడానికి సిద్ధమైనట్టు తెలిసింది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లిపోవడానికి అక్కడి నేతలతో రాయబారం నడుపుతున్నట్ల సమాచారం. ఓ వైపు నవోదయం, మరోవైపు నాటుసారాపై ఉక్కుపాదం, జిల్లా కేంద్రంలో ప్రోటో కాల్స్‌ లాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా వాటాలు పెంచమని ఆదేశిస్తే ఇక్కడ పనిచేయలేమని కొందరు ఖాకీలు తేల్చి చెబుతున్నారు.

– ఓ ఉన్నతాధికారి నుంచి సీఐకి

అందిన మౌఖిక ఆదేశం

– ఓ ఎకై ్సజ్‌ అధికారికి చిత్తూరు జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి హుకుం

ఎవరి వాటా వాళ్లదే

జిల్లాలో మొత్తం 113 మద్యం దుకాణాలున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన నూతన మద్యం పాలసీలో ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్ల ఆదాయం చేకూరింది. జిల్లాలో ఎనిమిది ఎకై ్సజ్‌ సర్కిళ్లు ఉంటే.. నెలకు కొన్నిచోట్ల దుకాణానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల రూ.15 వేల నుంచి రూ.18 వేలు వసూలు చేస్తున్నారు. సగటున ఒక్కో దుకాణం నుంచి రూ.25 వేలు అనుకున్నా.. నెలకు రూ.28 లక్షల వరకు వసూలవుతోంది. గత పది నెలల్లో రూ.2.8 కోట్లకు పైనే వసూలు చేశారు. ఇందులో ఓ అధికారికి దుకాణానికి రూ.4 వేలు, మరో అధికారికి షాపునకు రూ.2 వేలు, ఇంకొకరికి రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి. ఇది కాకుండా కూటమి నేతల్లో కొందరికి ఒక్కో దుకాణానికి రూ.5 వేలు ఇవ్వాలి. కొందరు నేతలు ఈ మొత్తం తీసుకోకుండా, దానికి సరిపడే ఆర్థికపరమైన బాధ్యతలను అధికారులకు అప్పగిస్తున్నారు. మిగిలిన దాంట్లో స్టేషన్‌లోని వాహనాలకు డీజిలు, స్టేషన్‌ నిర్వహణ చూసుకోవాలి. ఇది కాకుండా మద్యం బార్ల నుంచి అందే నెలవారీ మామూళ్లు అధనం.

‘చూడయ్యా..! నెలకు నువ్వు ఇచ్చేదే షాపునకు రూ.4 వేలు. ఏదో నాయకుడు అడిగాడు అని.. నా దాంట్లో తగ్గిస్తే ఎట్లా చెప్పు. నీ బాధలు ఏవైనా ఉంటే నువ్వే పడు. నేనేమీ బాస్‌ లాగా మొత్తం నాకే ఇవ్వమని చెప్పలేదు కదా. నాకు ఫ్యామిలీ ఉంది. ఖర్చులు ఉన్నాయి. మొన్న మంత్రి వచ్చిన రోజు ప్రొటోకాల్‌ ఖర్చు ఎంతయ్యిందో నీకు తెలియదా..? దయచేసి నా వాటా మాత్రం తగ్గించొద్దు.’

‘చూడండి. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు చేశా. చేతిలో డబ్బులు, అప్పులు చేసింది తిరిగి సంపాదించుకోవాలి కదా. మీ సర్కిల్‌లో ఇప్పటి వరకు ఇస్తా ఉండేది చాలదు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వేరే లెక్క ఇవ్వాలి. అవసరమైతే మీకు వచ్చేదాంట్లో తగ్గించుకోండి..’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement