
పట్ట పగలే రెండు ఇళ్లల్లో చోరీ
రొంపిచెర్ల: పట్టపగలే రెండు ఇళ్లల్లో దొంగలు పడి బంగారు నగలు, డబ్బును చోరీ చేసిన సంఘటన మండలంలోని చిచ్చిలివారిపల్లె పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు, రావిళ్లవారిపల్లె గ్రామానికి చెందిన మోడెం రమణయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళంవేసి వరి నాట్లు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు. ఇదే అదునుగా చూసుకుని దుండగులు చోరీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న బీరువాలోని రూ.40 వేలు నగదు, 25 గ్రాముల బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన మోడెం చిన్నస్వామి కూడా ఇంటికి తాళం వేసుకుని, పొలం వద్దకు వెళ్లడంతో ఆ ఇంట్లో కూడా రూ. 5 వేల నగదును చోరీ చేశారని తెలిపారు. ఈ విషయాన్ని బాఽధితులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.