
జిల్లా హౌసింగ్ పీడీగా సుబ్రహ్మణ్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా ఇన్‌చార్జి హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ అవినీతి ఆరోపణల కారణంగా ఈనెల 14న ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన ఈనెల 15వ తేదీ నుంచి పీడీ కేడర్‌లో కార్యాలయానికి వచ్చి పలు ఫైల్స్‌లో సంతకాలు చేశారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో ఈనెల 23వ తేదీన వదల బొమ్మాళీ....వదలా అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ స్పందించారు. గోపాల్ నాయక్ సస్పెన్షన్ విషయం పై ఆరా తీశారు. వెంటనే ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లా హౌసింగ్ పీడీగా కుప్పం ఈఈగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నూతన హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని హౌసింగ్ శాఖ కార్యాలయంలో పీడీగా బాధ్యతలు స్వీకరించారు.

జిల్లా హౌసింగ్ పీడీగా సుబ్రహ్మణ్యం

జిల్లా హౌసింగ్ పీడీగా సుబ్రహ్మణ్యం