
నిర్బంధ విధానం సరికాదు
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం టీచర్ల పట్ల నిర్బంధ విధానం అమలు చేయడం ఏ మాత్రం సరికాదని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులను ఎక్కువగా అమలు చేయడం అన్యాయమన్నారు. బోధనేతర పనుల వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడి, అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు. బోధన పట్ల ఏకాగ్రత కరువవుతోందని చెప్పారు. మెగా పీటీఎం పేరుతో పాఠశాలల్లో 17 కమిటీలు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యాశక్తి, ఆన్‌లైన్ కోర్సులు, తల్లికి వందనం పోటీలు, గ్రీన్ టైల్ నమోదు, వీడియోలు రికార్డు చేయడం వంటి అదనపు ఒత్తిళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయులపై నెట్టడం అన్యాయమన్నారు.