
ఉరేసుకోమంటారా..!?
● ధర ఇవ్వరు.. కాయలు కొనరు.. ● అయినా మామిడి పంట పండించాలంట ● చెట్లు తొలగిస్తే కేసుల నమోదు ● దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతలు కొందరు మామిడి రైతులపై పగబట్టారు. మామిడి రైతుల పీక నొక్కుతున్నారు. మామిడి పంట తొలగిస్తే నేరమంటున్నారు. కక్షగట్టి వేధిస్తున్నారు. అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. కేసులు, జరిమానాల పేరుతో రైతులను భయపెడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు పొగ పెడుతున్నారు. దీనిపై వివిధ పార్టీ నేతలు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. మామిడి పంటకు ఆంక్షలు ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మామిడి చెట్టు పూతకు వచ్చినప్పటి నుంచి కాయలు పక్వానికి వచ్చే వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. మంచి దిగుబడి వచ్చింది. ఆ సారి కొంచెం లాభాలైనా కళ్ల చూడచ్చని అనుకున్నారు. మామిడి కాయలు కోతలు మొదలయ్యాక తెలిసింది అసలు ధరల్లేవు అని.. ప్రభుత్వం ఒక వైపు అధికారులు మరోవైపు రోజుకో ధర ప్రకటిస్తుంటే, ఫ్యాక్టరీలు మాత్రం అసలు కాయలే కొనం అంటూ మొండికేశాయి. ఈ క్రమంలోనే మామిడి కాయల ట్రాక్టర్లు ఫ్యాక్టరీల ముందు బారులు తీరాయి. రోజులు గడిచిపోతున్నా ట్రాక్టర్లు మాత్రం అన్‌లోడ్ కావడం లేదు. ట్రాక్టర్‌లోనే కాయలు పండై కుళ్లిపోయాయి. విధిలేక రోడ్ల పక్కనే పోరబోసి ఖాళీ ట్రాక్టర్లు ఇంటికి చేరాయి. ఈ బాధతో ఇక మామిడి పంటకు బదులు వేరే ఏదైనా సాగు చేసుకుందామని, చెట్లను తొలగించేశారు. అయితే చెట్లను తొలగించే రైతులపై కేసులు పెడుతున్నారు. ఈ తరుణంలో మామిడి రైతులకు కన్నీటి సుడులు మొదలయ్యాయి.
రైతులను బతకనివ్వండి
ఏదైతే రైతుకు మంచి దిగుబడి ఇస్తుందో.. ఆ పంట పండించాలనే రైతు తాపత్రాయ పడుతుంటాడు. ఇప్పుడు మామిడి వల్ల రైతుకు ఒరిగింది ఏమి లేదు. ఈ పంట సక్రమంగా రాని పక్షంలో రైతు ప్రత్యామ్నాయంగా చూసుకుంటారు. అంతే కానీ మామిడి చెట్లను కొట్టేస్తున్నారని కేసులు పెట్టడం కరెక్టు కాదు. చిత్తూరులోని కొన్ని కార్యాలయాల్లో చెట్లు కొట్టేస్తున్నారని వీడియోలు తీసి పంపిస్తే ఎవరూ పట్టించుకోలేదు. రైతులను ప్రశాంతంగా బతకనివ్వండి.
– శరవణ, జనసేన పార్టీ నేత, చిత్తూరు
రైతు చనిపోతే బాధ్యతెవరిది
మామిడికి ప్రభుత్వం ప్రక టించిన మద్దతు ధర అమ లు కాలేదు. పండిన పంట ను అమ్ముకోవడానికి అవస్థ లు పడుతున్నాం. విధిలేని పరిస్థితుల్లో వేరే పంట పండించుకోవాలని చూస్తున్నాం. అటవీ శాఖ అధికారు లు గ్రీనరీ అంటున్నారు కదా. రైతు అప్పుల పాలై చ నిపోతే ఈ అధికారులు బాధ్యత వహిస్తారా? దయ చేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడే పీకల్లోతు అప్పుల్లో ఉన్నాం. చెట్టు కొట్టేస్తున్నారని జరిమానా లు, కేసులు పేరుతో మమ్మల్ని వేధించొద్దు.
– కొత్తూరు బాబు నాయుడు, రైతు నాయకుడు, చిత్తూరు
పంట మార్పిడికి అనుమతేంటి?
అతని పొలంలో అతను మా మిడి చెట్లు పెట్టుకున్నారు. పంట బాగా వచ్చి లాభాలుంటే ఏ రైతూ పంటను నేల మ ట్టం చేయడు. నష్టం వస్తే ప్ర త్యామ్నాయం చూసుకుంటా డు. అది రైతు ఇష్టం. గ్రీనరీ పేరుతో రైతులను అధికారు లు వేధిస్తే ఎలా? అలా అనుకుంటే అన్ని రకాల పంటలు గ్రీనరీనే కదా. అప్పుడూ ఏ పంటనూ కోయకూడదు. పంట మార్పిడికి అనుమతి తీసుకోవాలనడం విచిత్రంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. రైతులను ఇబ్బంది పెడితే. తిరగబడడం ఖాయం.
– నాగరాజు, సీపీఐ నాయకులు, చిత్తూరు

ఉరేసుకోమంటారా..!?

ఉరేసుకోమంటారా..!?

ఉరేసుకోమంటారా..!?