టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు! | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు!

Jul 2 2025 5:37 AM | Updated on Jul 2 2025 5:37 AM

టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు!

టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు!

● ఇంటింటికీ వెళ్లాలంటే భయం ● మామిడికి గిట్టుబాటు ధర కల్పించలేదు ● కనీసం కాయలను కొనుగోలు చేయని వైనం ● పింఛన్లు, తల్లికి వందనంలో కోతపై లబ్ధిదారుల ఆగ్రహం

అడుగడుగునా అక్రమాలే

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక, మట్టి, గ్రావెల్‌, మైనింగ్‌ అక్రమ తవ్వకాలు, అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. అక్రమార్కులు రాత్రింబవళ్లు జేసీబీల, ఇటాచీలు, లారీలు, టిప్పర్లతో ప్రకృతి సంపదను తరలించి సొమ్ముచేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అక్రమార్కులకు అధికారులు తోడయ్యారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదు. ఉచిత ఇసుక గురించి పట్టించుకునే ఎమ్మెల్యేలు, అధికారులు కరువయ్యారు. కూటమి నేతలు ప్రభుత్వ, పోరంబోకు, కాలువ, చెరువు పోరంబోకు భూములను ఆక్రమించి సొంతం చేసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. వేరొకరి అనుభవంలో ఉన్నా.. దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. ఇదేమిటని అడిగితే దౌర్జన్యానికి దిగుతున్నారు. అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. ఇలా ఏడాది పాలనపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలను నిలదీసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లటానికి ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: సుపరిపాలన పేరుతో ఇంటింటికీ వెళ్లడానికి టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గు బులు పట్టుకుంది. ఏడాది పాలనలో పథకాలు అమలు చేయకపోవటం, ఉమ్మడి జిల్లాలో మామి డి రైతులు ఆగ్రహంగా ఉండడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదు. అధినేత చంద్రబాబు ఆదేశించినట్లు ఇంటింటికీ వెళ్లినప్పుడు స్థానికులు నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి? అనేదానిపై ఎమ్మెల్యేలు అధికారులు, స్థానిక టీడీపీ నేతలతో సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కూటమి ఏడాది పాలన వైఫల్యాలపై ‘చంద్రబా బు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ చేపట్టనున్న విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీ కార్యక్రమానికి ముందే సుపరిపాలన పేరుతో ఇంటింటికీ ఎమ్మెల్యేలు వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించి, ప్రారంభించేశారు. అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నేడు కుప్పంలో పర్యటించనున్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ఇంటింటికీ వెళ్లనున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు.

పథకాలు అడగరా?

ఏడాది కూటమి పాలనలో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పింఛన్లు తొలగించిన వారే సుమారు 32 వేల మంది ఉన్నారు. వాటి స్థానంలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అతీగతి లేదు. పింఛను కోల్పోయిన వారు, కొత్తగా ఆశిస్తున్నవారు ఎమ్మెల్యేలను నిలదీస్తారని ఆందోళన చెందుతున్నారు. కొత్త రేషన్‌ కార్డులు లేవు, ఉన్న కార్డులకు పూర్తి స్థాయిలో సరుకులు ఇవ్వటం లేదు. కేవలం బియ్యం మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది ప్రభుత్వం. మరో వైపు తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది ప్రారంభమై ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా పైసా విదల్చలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, ఇతరత్రా హామీలు అమలు చేయకపోవటంపై లబ్ధిదారులు అసంతృప్తితో ఉన్నారు.

భయపెడుతున్న మామిడి

చిత్తూరు, తిరుపతి జిల్లాలో గత కొంత కాలంగా రైతులు మామిడి దిగుబడులను అమ్ముకోలేక వారు ఎదుర్కొంటున్న అవస్తలు వర్ణనాతీతం. మామిడి దిగుబడులతో రోజుల తరబడి ఫ్యాక్టరీల ముందు వేచి ఉన్నా కొనుగోలు చేసే పరిస్థితి కనిపించలేదు. గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్పినా ఫలితం కనిపించలేదు. అధికారులు ఆదేశించినా ఫ్యాక్టరీ యాజమాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో మామిడి రైతులు చేసేది లేక కడుపు మండి చెట్లను నరికేసుకుంటున్నారు. మరి కొందరు కాయలను రోడ్లపై పారబోసి వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళితే రైతులు విరుచుకుపడుతారన్న భయం టీడీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement