
జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
చిత్తూరుకలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం అందజేసే జాతీయ ఉత్తమ టీచర్ల అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఈ అవార్డులకు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హత, ఆసక్తి ఉన్న టీచర్లు ఈ నెల 13వ తేదీలోపు ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. www.nationalawardstoteachers.education.gov.in అనే వెబ్‌సైట్‌లో సమగ్ర వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
డిజిటల్ సర్వే సిస్టమ్ పరిశీలన
కుప్పం: కుప్పం నియోజకవర్గంలో టాటా సంస్థ చేపడుతున్న డిజిటల్ సర్వే సిస్టమ్ పనితీరును రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కృష్ణాబాబు పరిశీలించారు. బుధ, గురువారాలు సీఎం చంద్రబాబు కుప్పం వంద పడకల ఆస్పత్రిలో టాటా సంస్థ డిజిటల్ సర్వే సిస్టమ్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన కంగుంది పీహెచ్‌సీలో సర్వే పనితీరును పరిశీలించారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ సుమిత్‌కుమార్, డీయెన్సీ మెనేజర్ కమలేష్ పాల్గొన్నారు.