● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ నిలిపేసిన అమూల్‌ ● సిండికేట్‌గా మారిన ప్రైవేట్‌ డెయిరీలు ● తగ్గిపోయిన పాల ధరలు ● గిట్టుబాటుకాక ఆందోళనలో పాడి రైతులు ● పట్టించుకోని అధికారులు | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ నిలిపేసిన అమూల్‌ ● సిండికేట్‌గా మారిన ప్రైవేట్‌ డెయిరీలు ● తగ్గిపోయిన పాల ధరలు ● గిట్టుబాటుకాక ఆందోళనలో పాడి రైతులు ● పట్టించుకోని అధికారులు

Aug 24 2024 2:06 PM | Updated on Aug 24 2024 2:06 PM

● జిల

● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ ని

సంరక్షణ కష్టమే..

నాకు 5 ఆవులున్నాయి. రోజూ 30 లీటర్ల పాలను డెయిరీకి పోస్తున్నా. గతంలో అమూల్‌కు పోసేప్పుడు లీటర్‌ రూ.44 గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు రూ.30 కంటే తగ్గింది. ఈ రేట్లతో పాడి ఆవులను మేపడం వేస్టే. ధరల విషయంలో పాల డెయిరీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. పొద్దస్తమాన్నం ఆవులకు చాకిరీ చేసి వాటికి మేత, గానుగపిండి పెట్టి పోషిస్తే మాకూలికూడా మిగలడంలేదు. ఈ రేట్లతో ఆవుల సంరక్షణ కష్టమే.

– జయరామిరెడ్డి, పాడిరైతు, బేరుపల్లె, పలమనేరు మండలం

అమ్మేద్దామనుకుంటున్నా

అప్పుచేసి రెండు ఆవులను రూ.2.20లక్షలు పెట్టి కొన్నా. నెలకు రూ.4వేలు వడ్డీ కడుతున్నా. ఈడ చూస్తే లీటర్‌ పాల ధర రూ.27 నుంచి రూ.30 మాత్రమే ఉంటోంది. రెండు ఆవులు చేరి పూటకి 15 లీటర్ల పాలిస్తున్నాయి. నెలకు 450 లీటర్లు అనుకున్నా లీటర్‌ రూ.30 అయితే రూ.13,500 బిల్లు వస్తుంది. ఆవులకు దాణాకోసం నెలకు రూ.7వేలు ఖర్చు, నెల వడ్డీ రూ.4వేలు ఆలెక్కన రూ.11 వేలు ఖర్చుపోతే మిగిలేది రూ.2,500 మాత్రమే. అందుకే ఆవులను అమ్మేద్దామనుకుంటున్నా. –పాండు, యానాదికాలనీ, పలమనేరు మండలం

ఇది మరీ మోసం

నేను 30 ఏళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నా. ఇప్పుడున్న దాణా ధరలు, పెరిగిన పాడి ఆవుల రేట్లతో లీటర్‌కు రూ.40పైగా వస్తేనే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. ఈ మధ్య వర్షాల కారణంగా పచ్చిమేత లభ్యమవుతోంది. దీంతో పాల ఉత్పత్తి పెరిగింది. తమకు కావాల్సిన పాల కంటే ఎక్కువగా వస్తున్నాయని పాలను డెయిరీ వాళ్లు వెనక్కి పంపుతున్నారు.లీటరు రూ.10 దాకా ధరను తగ్గించేశారు. ధరలు ఇలాగే ఉంటే పాడి పశువులను రైతులు అమ్ముకోవాల్సిందే. – పాలు శీనా, పాల ఏజెంట్‌, బైరెడ్డిపల్లె

● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ ని1
1/3

● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ ని

● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ ని2
2/3

● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ ని

● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ ని3
3/3

● జిల్లాలో కుదేలైన పాడి పరిశ్రమ ● 21 నుంచి పాల సేకరణ ని

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement