
గంగమ్మ ఆలయంలో ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప
పెద్దపంజాణి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప కోరారు. సోమవారం మండలంలోని మాదనపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెడ్డెప్ప మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేకువనే సామాజిక పింఛన్లు అందాలన్నా.. పేద బిడ్డలకు ఉన్నత చదువులు అందుబాటులోకి రావాలన్నా.. పేదలకు ఖరీదైన వైద్యం అందాలన్నా రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా వెంకటేగౌడను, ఎంపీగా తను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డెప్ప, పార్టీ మండల కన్వీనర్ బాగా రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుష్మకీర్తి, వైస్ ఎంపీపీలు జీడీ బాబు, ఆంజమ్మ తదితరులు పాల్గొన్నారు.