వైఎస్సార్‌ సీపీలోకి భారీగా వలసలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి భారీగా వలసలు

Apr 14 2024 2:10 AM | Updated on Apr 14 2024 2:10 AM

- - Sakshi

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమాన్ని ఆపలేదని, పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తున్న సీఎం జగనన్నకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ప్రతి గడపకూ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి ఫ్యాను గుర్తుకు ఓటు వేసేలా ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.

పుంగనూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పులిచెర్లలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పుంగనూరు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో మండలంలోని భరిణేపల్లెకు చెందిన టీడీపీ నేతలు చందు యాదవ్‌, మంజునాథ్‌, పురుషోత్తం, సురేష్‌, బాలాజి, రాజేంద్రనాథ్‌, మురుగేష్‌, గోవిందు తదితర 20 కుటుంబాల వారు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించారని తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌ సీపీకి రెండు ఓట్లు వేసి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి దేశిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

బంగారుపాళెం మండలంలో..

బంగారుపాళెం: మండలంలోని తుంబపాళెంకు చెందిన టీడీపీ కార్యకర్తలు భాస్కర్‌, మోహన్‌, మురళి శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పాలఏకరి కార్పొరేషన్‌ చైర్మన్‌ కుమార్‌రాజా, పార్టీ మండల కన్వీనర్‌ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, వైస్‌ ఎంపీపీ శిరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిక

పులిచెర్ల(కల్లూరు): కల్లూరు, పాళెం పంచాయతీలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి ఆయన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారు తెలిపారు.

సొంత గూటికి చేరిన కార్యకర్తలు

పెద్దపంజాణి: మండలంలోని రాయలపేటకు చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు చిత్తూరు బాబు, గంగయ్య, రామ్‌లక్ష్మణ కొద్ది రోజుల క్రితం టీడీపీలో చేరారు. అక్కడ ఇమడలేమని భావించి శనివారం రాయలపేటలో ఎమ్మెల్యే వెంకటేగౌడ సమక్షంలో మళ్లీ వైఎస్సార్‌ సీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య సలహాదారు డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆంజమ్మ, నాయకులు పద్మనాభ జెట్టి, మునిరాజ, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.

పెద్దపంజాణి: కండువాలు కప్పి పార్టీలోకి 
ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ  1
1/2

పెద్దపంజాణి: కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ

బంగారుపాళెం: టీడీపీ కార్యకర్తలను పార్టీలోకి 
ఆహ్వానిస్తున్న డాక్టర్‌ సునీల్‌కుమార్‌2
2/2

బంగారుపాళెం: టీడీపీ కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న డాక్టర్‌ సునీల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement