ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాలలోని ఉద్యోగులను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే లెక్కకు మించిన ఉద్యోగులు ఏఐ వల్ల ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పుడు తాజాగా.. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఈ జాబితాలోకి చేరింది. అయితే ఈ సంస్థ ఉద్యోగులను బలవంతంగా తొలగించడంలేదు, కానీ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించింది.
ఏఐ టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో.. యూట్యూబ్‌లో తప్పకుండా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ 'నీల్ మోహన్' ప్రస్తావించారు. కాగా పదేళ్ళలో మొదటిసారి తన ప్రొడక్ట్ డివిజన్‌లో మార్పులు చేస్తున్నారు.
అమెరికాలో పనిచేస్తున్న యూట్యూబ్ ఉద్యోగులు.. స్వచ్చందంగా తమ ఉద్యోగాన్ని వదులుకుంటే, పరిహారం కింద వారికి నిష్క్రమణ ప్యాకేజీలను అందించనున్నట్లు వెల్లడించారు. కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి వాటిని ఏఐ ప్రభావితం చేయనుంది. కొత్త మార్పులు 2025 నవంబర్ 05 నుంచి అందుబాటులో రానున్నాయి.
ఇదీ చదవండి: కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!
యూట్యూబ్ మాతృ సంస్థ.. గూగుల్ తన ఉత్పత్తులు, సేవలలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ పునర్నిర్మాణం జరిగింది. ఏఐ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని సీఈఓ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తమ బృందాలను కోరారు.


