మాంద్యంలో బ్రిటన్‌! పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం.. అసలేం జరుగుతోంది?

UK likely in recession analysis by Bloomberg  - Sakshi

పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్‌ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ బహుశా ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ ఎకనామిక్స్‌ విశ్లేషణ పేర్కొంటోంది. 

వరుసగా తిరోగమనం
వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి మందగించిన క్రమంలో ఈ సంవత్సరం ద్వితీయార్థంలో తేలికపాటి మాంద్యం ఏర్పడే అవకాశం 52 శాతం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. త్వరలో బ్రిటన్‌ జీడీపీ గణాంకాలు అధికారికంగా వెలువడనున్న నేపథ్యంలో ఈ విశ్లేషణ ప్రచురితమైంది.

వృద్ధి సంకోచం తేలికపాటిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ అసమానతలు మాంద్యానికి దారితీసినట్లు బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్‌ అనలిస్ట్‌ డాన్ హాన్సన్ ప్రచురణ నోట్‌లో పేర్కొన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్రిటన్‌ జీడీపీ 0.1 శాతం పడిపోయిందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం, 4.3 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అంచనా వేసింది.

రిషి సునక్‌కు తలనొప్పిగా మాంద్యం!
బ్రిటన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక మాంద్యం ప్రధానమంత్రి రిషి సునక్‌కు తలనొప్పిగా మారనుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు అనివార్యం కానున్నాయి.

తన అంచనాల్లో ఇప్పటికే తేలికపాటి మాంద్యాన్ని సూచించిన బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ మూడో త్రైమాసికంలో జీడీపీ తిరోగమన అవకాశం 70 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. జులైలో 0.6 శాతం జీడీపీ క్షీణించగా ఆగస్టులో పెద్దగా పుంజుకోలేదు. కాగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మాత్రం మాంద్యానికి 50 శాతం 
అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top