
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికాలు, పవర్ గ్రిడ్లలో విరివిగా ఉపయోగించే కాపర్ దేశీయ ఉత్పత్తిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ దిగుమతి చేసుకునే కాపర్‌పై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ కేబినెట్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. టారిఫ్ రేటును ప్రకటించినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారో మాత్రం తెలియజేయలేదు.
ఉక్కు, అల్యూమినియం, ఆటో విడిభాగాలపై ఇదే విధమైన సుంకాలను ఇప్పటికే విధించారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాపర్ ధరలు రికార్డు గరిష్టాలకు పెరిగాయి. కమోడిటీ ఎక్స్చేంజీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ పౌండ్‌కు 10% పైగా పెరిగి 5.8955 డాలర్లకు చేరుకుంది. దిగుమతి సుంకం వల్ల యూఎస్‌లోని చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయనే అంచనాలతో యూఎస్ కాపర్ ఉత్పత్తిదారు ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ షేర్లు 5% పెరిగాయి.
ఫార్మాపై కూడా..
అమెరికా ప్రస్తుతం తన కాపర్ వినియోగంలో దాదాపు సగం దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఎక్కువ భాగం చిలీ నుంచే సమకూరుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ దేశంలో తయారయ్యే కాపర్‌పై ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో ట్రంప్ అదనంగా మరిన్ని సుంకాల గురించి కూడా సంకేతాలు ఇచ్చారు. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై 200% సుంకం రావచ్చని, అయితే కంపెనీలు తమ ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించడానికి 18 నెలల వరకు సమయం ఉండవచ్చని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్‌కార్పెట్
కాపర్‌పై సుంకాలతో కీలక రంగాలపై ప్రభావం
ఎలక్ట్రిక్ వాహనాలు: బ్యాటరీలు, మోటార్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు రాగి అవసరం.
నిర్మాణం, విద్యుత్ రంగం: పవర్ గ్రిడ్, నిర్మాణ రంగం రాగి వైరింగ్, ట్యూబ్‌లపై ఎక్కువగా ఆధారపడుతాయి. ఇది భవన ఖర్చులను పెంచుతుంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్: ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాల్లో గణనీయంగా రాగిని ఉపయోగిస్తారు.
డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్: సైనిక పరికరాల్లో వైరింగ్, ఎలక్ట్రానిక్స్ కోసం రాగిని ఎక్కువగా వాడుతారు.