విషాద‌క‌ర ఘ‌ట‌న‌.. పొర‌పాటా, సాంకేతిక లోప‌మా? | Tragic Incident Involving Tata Harrier EV Sparks Safety Debate | Sakshi
Sakshi News home page

విషాద‌క‌ర ఘ‌ట‌న‌.. పొర‌పాటా, సాంకేతిక లోప‌మా?

Aug 22 2025 3:19 PM | Updated on Aug 22 2025 5:36 PM

Tragic Incident Involving Tata Harrier EV Sparks Safety Debate

తమిళనాడులో టాటా హారియర్‌ ఈవీ ఆటోపైలట్‌ మోడ్‌ వల్ల ఓ వ్యక్తి మృతి చెందాల్సి వచ్చిందనేలా సామాజిక మాధ్యామాల్లో వీడియో వైరల్‌ అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా మృతుడి పొరపాటా.. లేదా కారులో సాంకేతిక లోపమా అనే స్పష్టమైన కారణాలు తెలియరాలేదని గమనించాలి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలోని వివరాల ప్రకారం.. ఆటో పైలట్‌ మోడ్‌ ఆన్‌ చేసిన ఓ వ్యక్తి మీదకు అదుపుతప్పి టాటా హారియర్ ఈవీ దూసుకుపోయింది. తమిళనాడులోని అవినాశిలో జరిగిన ఈ ఘటనలో బాధితుడి తలకు బలమైన గాయమైంది. డ్రైవర్ కారు డోర్‌ ఓపెన్‌ చేసి క్యాబిన్‌లోకి అడుగు పెట్టకముందే అప్పటికే ఎత్తుపై ఉన్న హ్యారియర్ ఒక్కసారిగా వంపులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడిన ఆ వ్యక్తిపైకి కారు ​టైర్‌ ఎక్కేసింది. ఈ సంఘటనలో అతడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.

అయితే టాటా మోటార్స్‌పై కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణం అయితే తెలియరాలేదు. ఇది సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదా బాహ్య కారకాల వల్ల సంభవించిందా అనేది ధ్రువీకరించాల్సి ఉందని గమనించాలి. 

టాటా మోటార్స్ ప్రకటన

ఈ ఘటనపై టాటా మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వాస్తవాలను సేకరిస్తున్నట్లు చెప్పింది. వీడియోలోని దశ్యాల ప్రకారం వాలుగా ఉండడంవల్లే వాహనం కిందకు వచ్చి ఉంటుందని పేర్కొంది.

సమన్‌ మోడ్

కిక్కిరిసిన పార్కింగ్ స్థలాల కోసం డిజైన్ చేయబడిన కీని ఉపయోగించి రిమోట్‌గా కారు ముందుకు కదలడానికి లేదా రివర్స్ చేయడానికి అనుమతించే సెమీ అటానమస్ ఫీచర్. జూన్ 2025లో హారియర్ ఈవీతో ప్రవేశపెట్టిన టాటా అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్‌) సూట్‌లో ఇది భాగం. ఇదిలాఉండగా, ఇలాంటి ఫీచర్లను అమలు చేయడానికి ముందు కఠినమైన నిబంధనలు, యూజర్ ఎడ్యుకేషన్, రియల్ వరల్డ్ టెస్టింగ్ చేయాలని నిపుణులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement