
Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 11 పాయింట్ల నష్టంతో 64,937 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 19,319 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటర్స్, మారుతి సుజుకీ, నెస్లే కంపెనీ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. అలాగే హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, టీసీఎస్, హిందాల్కో, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)