టీసీఎస్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు.. క్యాంపస్‌ నియామకాలు డౌటేనా? | TCS says it may continue to see headcount reductions | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు.. క్యాంపస్‌ నియామకాలు డౌటేనా?

Jan 11 2024 9:27 PM | Updated on Jan 12 2024 3:11 PM

TCS says it may continue to see headcount reductions - Sakshi

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య భారగా తగ్గింది. 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంటే మూడు నెలల్లో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 5,680 పడిపోయిందని ‘ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ నివేదించింది.

టీసీఎస్‌లో హెడ్‌కౌంట్‌ తగ్గడం వరుసగా ఇది రెండో త్రైమాసికం. టీసీఎస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2023 జూన్ చివరి నాటికి 6.15 లక్షలు ఉండగా తాజా క్షీణతతో డిసెంబర్ చివరి నాటికి 6.03 లక్షలకు తగ్గింది. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఎప్పటిలాగా కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నియామకాల లక్ష్యాన్ని సైతం కంపెనీ స్పష్టం చేయడం లేదు. 

బలవంతపు తొలగింపుల కంటే కూడా ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని విడిచిపెట్టడం వల్లే హెడ్‌కౌంట్ తగ్గినట్లు భావిస్తున్నారు. కంపెనీ వదిలివెళ్లిన ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు చేపట్టనప్పుడు కూడా హెడ్‌కౌంట్ తగ్గుతుంది.

తాము మంచి సంఖ్యలోనే ఉద్యోగులను, ట్రైనీలను మార్కెట్ నుంచి నియమించుకున్నామని, నియామకం ఎల్లప్పుడూ అట్రిషన్‌కి అనుగుణంగా ఉండకపోవచ్చని టీసీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌ఆర్‌ గ్లోబల్‌ హెడ్‌ మిలింద్‌ లక్కడ్‌ చెబుతున్నారు. అయితే దీనిని ప్రతికూలంగా చూడవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. భవిష్యత్ త్రైమాసికాల్లోనూ ఇదే విధమైన క్షీణత కనిపించవచ్చని ఆయన హింట్‌ ఇచ్చారు.

క్యాంపస్‌ నియామకాలు డౌటే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకునే లక్ష్యానికి టీసీఎస్‌ ఇప్పటికీ కట్టుబడి ఉందా అంటే మిలింద్‌ లక్కడ్‌ స్పష్టత ఇవ్వలేదు. 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మా వద్ద ఖచ్చితమైన సంఖ్య లేదు కానీ క్యాంపస్‌ నియామకాలలో ముందుంటామని లక్కడ్‌ చెప్పారు. నేర్చుకునే సామర్థ్యం, జిజ్ఞాస, ఆప్టిట్యూడ్, కోడింగ్ నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement