
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ఆరంభమయ్యాయి. సెన్సెక్స్ 186 పాయింట్లు ఎగిసి 50727.30, నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 15211.40, నిఫ్టీ బ్యాంకు సూచీలు 200 పాయింట్లు పెరిగి 34869 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ షేర్లు లాభాల బాటలో కొనసాగుతుండగా... బీపీసీఎల్, హీరో మోటార్‌కార్‌్ప, హిందాల్కో, ఐషర్ మోటార్స్ సైతం లాభాలు చవిచూస్తున్నాయి. ఐటీ, రియల్టీ, ఫార్మా, ఆటో మొబైల్ రంగాల షేర్లు లాభదాయకంగా ఉండగా.. మెటల్ రంగం స్వల్ప నష్టాలతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. ఉదయం సూచీలు ప్రారంభమైన కొద్దిసేపటికి సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత వెంటనే కోలుకున్న సూచీలు అదే జోరును కనబరిచాయి. చివరకు సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 50,651 వద్ద ముగిస్తే, నిఫ్టీ 22 పాయింట్లు ఎగబాకి 15,197 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.93 వద్ద నిలిచింది. కరోనా వ్యాప్తి తగ్గుతుండడంతో పాటు టీకా ఉత్పత్తి పెంచే ప్రయత్నాలు జరుగుతుండటంతో మార్కెట్‌లో సానకూల సెంటిమెంటు ఏర్పడింది.