సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభం.. కొనసాగుతున్న స్టాక్‌ ర్యాలీ | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభం.. కొనసాగుతున్న స్టాక్‌ ర్యాలీ

Published Mon, Jan 15 2024 9:50 AM

stock market rally today opening Monday - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈవారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీల గత సెషన్ ర్యాలీ సోమవారం కొనసాగింది. రెండో రోజు తాజా గరిష్టాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 550 పాయింట్లు ఎగసి 73,127 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 133 పాయింట్లు ఎగబాకి 22,000 వద్దకు చేరుకుంది.

సెన్సెక్స్‌లో విప్రో, హెచ్‌సీఎల్‌టెక్ వరుసగా 10 శాతం, 4 శాతం ఎగబాకాయి. తర్వాతి విజేతలుగా టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎస్‌బీఐ నిలిచాయి. మరోవైపు, ఏషియన్ పెయింట్స్, నెస్లే, హెచ్‌యుఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కొన్ని ఫ్రంట్‌లైన్ డ్రాగ్‌లలో ఉన్నాయి.

ప్రీ ఓపెనింగ్‌ పరిస్థితులను ఓ సారి పరిశీలిస్తే.. డోజోన్స్‌ 118 పాయింట్లు కోల్పోగా, S&P 500, నాస్‌డాక్ ఫ్లాట్‌గా ముగిశాయి. చాలా ఆసియా-పసిఫిక్ మార్కెట్లు క్షీణించాయి. ఓటర్లు అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి వరుసగా మూడోసారి అధ్యక్ష పదవిని అప్పగించడంతో తైవాన్ ప్రధాన స్టాక్ ఇండెక్స్ పెరిగింది.

గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ లైన్‌లో ట్రేడైంది. యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాల్లోని లక్ష్యాలపై యూఎస్‌, యూకే సైనిక దాడులు నిర్వహించడంతో చమురు ధరలు పెరిగాయి. WTI, బ్రెంట్ ఫ్యూచర్స్ శుక్రవారం ఉదయం 4శాతానికిపైగా పెరిగి డిసెంబర్ 27 తర్వాత అత్యధిక స్థాయిలను తాకాయి.

యూఎస్ ముడి చమురు బ్యారెల్ 75.25 డాలర్లకు పెరిగింది. అదే సమయంలో గ్లోబల్ బెంచ్‌మార్క్  80.75 డాలర్లను తాకింది. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతన్న ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు శుక్రవారం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

వార్తల్లోని స్టాక్స్

హెచ్‌సీఎల్‌ టెక్: 2024 ఆర్థిక సంవత్సరం క్యూ3లో లాభం అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 13.5 శాతం పెరిగి రూ. 4,350 కోట్లకు చేరింది. ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.28,446 కోట్లకు చేరుకుంది

విప్రో: ఐటీ సేవల ఆదాయం కిందటి త్రైమాసికం కంటే 1.1 శాతం తగ్గి రూ. 22,150.8 కోట్ల చేరింది. ఆదాయం 2.1 శాతం క్షీణించి 2,656.1 మిలియన్‌ డాలర్లకు పడిపోయింది

అవెన్యూ సూపర్‌మార్ట్స్‌: రూ. 690 కోట్ల వద్ద ఏకీకృత లాభంలో 17% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఆపరేషన్స్‌ ఆదాయం సంవత్సరానికి 17.3% పెరిగి రూ. 13,572 కోట్లకు చేరుకుంది. మార్జిన్ 8.3 శాతం వద్ద స్థిరంగా ఉంది

ఈరోజు కీలక ఫలితాలు
జియో ఫైనాన్షియల్, ఏంజెల్ వన్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్, కేసోరామ్ ఇండ్, మెటాలిస్ట్ ఫోర్జింగ్స్, నెల్కో.. ఈరోజు ఉన్న కీలక ఫలితాలు

టాటా కన్స్యూమర్‌: క్యాపిటల్ ఫుడ్స్‌లో 100% వాటాను రూ. 5,100 కోట్లకు, ఆర్గానిక్ ఇండియాను రూ. 1,900 కోట్లకు కొనుగోలు చేస్తోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ న్యూ ఇండస్ట్రీస్ భారత్‌లో సంవత్సరానికి 198.5 MW సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్‌లను ఏర్పాటు చేయడానికి సోలార్ ఎనర్జీ కార్ప్ నుంచి ఎల్‌ఓఏ అందుకుంది.

బీహెచ్‌ఈఎల్‌: ఒడిషాలోని 3x800 MW NLC తలబిరా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఎన్‌ఎల్‌సీ ఇండియా నుంచి ఎల్‌ఓఏ అందుకుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.15,000 కోట్లు.

లుపిన్: ప్రొప్రానోలోల్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ క్యాప్సూల్స్ కోసం లుపిన్ సంక్షిప్త కొత్త డ్రగ్ అప్లికేషన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం. ఇండెరల్ ఎల్‌ఏ హైడ్రోక్లోరైడ్ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ తరహా జనరిక్‌ క్యాప్సూల్స్‌ మార్కెటింగ్‌కు యూఎస్‌లోని ఏఎన్‌ఐ ఫార్మాస్యూటికల్స్ నుంచి అనుమతి. 

జిల్లెట్ ఇండియా: రూ. 222.9 కోట్లతో 3.3 లక్షల షేర్లను కొనుగోలు చేసిన నిప్పాన్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌. రూ. 405.5 కోట్ల విలువైన 6 లక్షల షేర్లను (పెయిడ్-అప్ ఈక్విటీలో 1.8%) విక్రయించిన అడ్వెంట్జ్ ఫైనాన్స్.

సికల్ లాజిస్టిక్స్: షేరుకు రూ. 270.6 చొప్పున 6 లక్షల షేర్లను (పెయిడ్-అప్ ఈక్విటీలో 0.9%) విక్రయించిన ప్రమోటర్ ప్రిస్టైన్ మాల్వా లాజిస్టిక్స్ పార్క్. ఈ బ్లాక్ డీల్‌లో నెగెన్ క్యాపిటల్ సర్వీసెస్ కొనుగోలుదారు.

మనీ మంత్రా
ఇన్వెస్టర్లు సాధారణ ఎఫ్‌డీలతో పాటు పన్ను మినహాయింపు, అధిక వడ్డీ కోసం పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలను కూడా అన్వేషిస్తారు. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఎఫ్‌డీలో డిపాజిట్ చేసిన మొత్తంపై మాత్రమే వర్తిస్తుంది. కానీ దానిపై వచ్చే వడ్డీకి పన్ను ఉంటుంది. 

ఒకవేళ మీరు జాయింట్‌ డిపాజిట్‌ని ఎంచుకుంటే, సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం డిపాజిట్ మొదటి హోల్డర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.100, గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు

బ్యాంక్                            వార్షిక వడ్డీ రేటు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్          7%
ఐసీఐసీఐ బ్యాంక్               7%
కోటక్ మహీంద్రా                6.2%
ఎస్‌బీఐ                             6.5%
పంజాబ్‌ నేషనల్‌ బ్యాక్‌     6.5%

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
Advertisement