
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,127.91 పాయింట్లు లేదా 1.39 శాతం లాభంతో 82,458.48 వద్ద నిలిచింది. నిఫ్టీ 395.20 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో 25,062.10 వద్ద ఉంది.
మోటార్ అండ్ జనరల్ ఫైనాన్స్, రుద్రాభిషేక్ ఎంటర్‌ప్రైజెస్, నెల్‌కాస్ట్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, ఇంటెన్స్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వెండ్ట్ (ఇండియా), సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్, డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్, హికాల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).
