
అమెరికా - చైనా టారిఫ్‌లకు 90 రోజులు బ్రేక్ పడిన తరువాత.. భారీ లాభాల్లో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు, మళ్ళీ ఈ రోజు (మంగళవారం) ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,281.68 పాయింట్లు లేదా.. 1.55 శాతం నష్టంలో 81,148.22 వద్ద, నిఫ్టీ 346.35 పాయింట్లు లేదా 1.39 శాతం నష్టంతో.. 24,578.35 వద్ద నిలిచాయి.
ఇన్స్పిరిసిస్ సొల్యూషన్స్, డైనమిక్ కేబుల్స్, లింక్, ఇన్ఫోబీన్స్ టెక్నాలజీస్, గిన్ని ఫిలమెంట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డీఎంసీసీ స్పెషాలిటీ కెమికల్స్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్, అనుప్ ఇంజనీరింగ్, కృష్ణ డయాగ్నోస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).