
మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 591.52 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో.. 81,584.94 వద్ద, నిఫ్టీ 174.95 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 24,826.20 వద్ద నిలిచాయి.
నూపూర్ రీసైక్లర్స్, బోరానా వీవ్స్ లిమిటెడ్, శ్రీరామ్ ప్రాపర్టీస్, క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్, కామ్లిన్ ఫైన్ సైన్సెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్, ట్రాక్సన్ టెక్నాలజీస్, బజాజ్ హెల్త్‌కేర్, పార్శ్వనాథ్ డెవలపర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).