హైదరాబాద్: ఆర్థిక, ఎగుమతులు, స్థిరమైన అభివృద్ధి రంగాలలో బలమైన స్థానం కలిగిన విభిన్న వ్యాపార సంస్థ సింప్లీజిత్ గ్రూప్.. రియల్ ఎస్టేట్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అరేబియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (ACC) ఇండియాలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.
ఏసీసీ గ్రూప్ ఇంజనీరింగ్ ప్రతిభను, సింప్లీజిత్ గ్రూప్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ & వ్యూహాత్మక ఫండింగ్ సామర్థ్యాలను కలిపి, ఈ భాగస్వామ్యం ప్రపంచ ప్రమాణాలతో కూడిన.. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మధ్యప్రాచ్యంలోని ప్రముఖ ఫ్యామిలీ ఆఫీసులు.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో ఉన్న బలమైన సంబంధాల ద్వారా, ఏసీసీ విస్తరణకు అవసరమైన వృద్ధిని సింప్లీజిత్ సమకూర్చనుంది.
అరేబియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) మేనేజింగ్ డైరెక్టర్ అనీ రే.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సింప్లీజిత్ గ్రూప్ స్పష్టమైన దృష్టి & విస్తరణ దిశగా చూపిన సిద్ధత ఈ భాగస్వామ్యానికి బలమైన పునాది. ఏసీసీ ఇండియా వృద్ధికి ఇది కొత్త అధ్యాయం అవుతుందని అన్నారు.
సింప్లీజిత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అభిజిత్ జయంతి మాట్లాడుతూ.. ఏసీసీ గ్రూప్‌తో భాగస్వామ్యం మా విస్తరణ దృష్టిని మరింత బలపరుస్తోంది. మా ఆర్థిక బలం & ఏసీసీ ఆర్కిటెక్చరల్ ప్రతిభను సమన్వయం చేస్తూ, భారత రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రమాణాలను సృష్టించాలనుకుంటున్నామని అన్నారు.


