డే హై నుంచి మార్కెట్‌ పతనం: రికార్డు కనిష్టానికి రూపాయి ఢమాల్‌

Sensex sheds 600pts from day high - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 600 పాయింట్ల మేర ఎగిసిన  డే హై నుంచి పతనమైంది. సెన్సెక్స్‌ ఒక దశలో 53,866 గరిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారిగా 16,000 మార్క్‌ను దాటింది. యితే లాభాల స్వీకరణతో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది.  డై హై నుంచి 600 పాయింట్లు కోల్పోయింది. చివరకు సెన్సెక్స్‌ 100 పాయింట్లు క్షీణించి 53134 వద్ద, నిఫ్టీ24  పాయింట్ల నష్టంతో 15810  వద్ద స్థిరపడ్డాయి. 

మెటల్ రంగ షేర్లు లాభపడగా ఆటో, ఐటీ షేర్లు నష్టాల్లో ముగిసాయి. హిందాల్కో,  ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్‌, శ్రీసిమెంట్స్‌,  పవర్‌ గ్రిడ్‌, ఎంఎంటీసీ, మార్క్సన్స్ ఫార్మా టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. ఇంకా ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, విప్రో, బ్రిటానియా, బీపీసీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా ముగిసాయి.

మరో వైపు దేశీయ కరెన్సీ రూపాయి  మంగళవారం 79.14 వద్ద మరో రికార్డు కనిష్టానికి చేరింది. చివరలో మరింత పతనమై 79.36 వద్ద రికార్డు కనిష్టం, ముగింపును నమోదు చేసింది. సోమవారం 78.95 వద్ద ముగిసిన రూపాయి నేడు  ఆరంభంలోనే బలహీనపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top