Stockmarket:లాభాల రింగింగ్‌,బ్యాంక్స్‌, ఐటీ గెయిన్‌ | Sensex Rallies Over 350 Points;Autos, It Gains | Sakshi
Sakshi News home page

Stockmarket:లాభాల రింగింగ్‌,బ్యాంక్స్‌, ఐటీ గెయిన్‌

Jul 5 2021 10:39 AM | Updated on Jul 5 2021 1:12 PM

Sensex Rallies Over 350 Points;Autos, It Gains - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సానుకూల ప్రపంచ సూచనల నేపథ్యంలో ఆరంభంలోనే 200  పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ 345 పాయింట్ల లాభంతో 52820 వద్ద నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 15819వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల  షేర్లలోనే కొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. దీంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు  ఎగువకుచేరాయి. 

ఆటో, ఐటీ  ఫైనాన్షియల్ స్టాక్స్ లాభ పడుతున్నాయి. పార్మా నష్టపోతోంది. బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టిసిఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ,  బజాజ్ ఫిన్‌సర్వ్, ఎం అండ్ ఎం లాభపడుతుండగా, టెక్ మహీంద్రా, డా.రెడ్డీస్‌ భారీగా నష్టపోతున్నాయి. వాల్ స్ట్రీట్ శుక్రవారం కొత్త గరిష్ట స్థాయికి తాకింది.  దీనికితోడు ఒపెక్  దాని మిత్రదేశాల మధ్య  మరో సమావేశం నేపథ్యంలో చమురు ధరల  76 డాలర్లకు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement