రూపే క్రెడిట్‌ కార్డులకు ప్రత్యేక సౌకర్యాలు | RuPay credit card new rules special experience at airport lounge | Sakshi
Sakshi News home page

రూపే క్రెడిట్‌ కార్డులకు ప్రత్యేక సౌకర్యాలు

Oct 26 2024 9:16 AM | Updated on Oct 26 2024 9:33 AM

RuPay credit card new rules special experience at airport lounge

రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ఎన్‌పీసీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. కార్డ్ హోల్డర్‌లకు విమానాశ్రయాలలో ఉన్న ప్రత్యేక రూపే లాంజ్‌లలో ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. కొత్త నియమాలు వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి.

“ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టీ3 డిపార్చర్ టెర్మినల్‌లో రూపే  ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. బోర్డింగ్ గేట్ నంబర్ 41 వద్ద డిపార్చర్ పీర్ 11, టీ3డీ దగ్గర ఇది రూపే మొట్టమొదటి ప్రత్యేక లాంజ్. రూపే ప్రత్యేక లాంజ్ అనేక రకాల ఆహారం, పానీయాలు, వినోదాలను అందిస్తుంది" అని ఎన్‌పీసీఐ పేర్కొంది.

నూతన మార్గదర్శకాల ప్రకారం, రూపే క్రెడిట్‌కార్డు యూజర్లకు ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ చేసే వ్యయం ఆధారంగా నిర్ణయించారు. రూ.10,000 నుంచి రూ.50,000 ఖర్చు చేస్తే మూడు నెలల్లో లాంజ్‌ను రెండు సార్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.50,001 నుంచి రూ.లక్ష వరకూ వ్యయంపై నాలుగు సార్లు ఉచిత యాక్సెస్‌ ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు వరకూ అయితే 8, రూ.5 లక్షలకుపైన ఖర్చే చేస్తే అపరిమిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.

ఇదీ చదవండి: మామూలు బ్యాంక్‌ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!

ఇటీవల పలు  విమానాశ్రయ లాంజ్‌లు రూపే కార్డులను స్వీకరించడం ప్రారంభించాయి. యూపీఐలో క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించిన తర్వాత రూపే కార్డ్‌ల జారీ పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 3లో రూపే తన మొదటి ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement