breaking news
airport lounges
-
రూపే క్రెడిట్ కార్డులకు ప్రత్యేక సౌకర్యాలు
రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ఎన్పీసీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. కార్డ్ హోల్డర్లకు విమానాశ్రయాలలో ఉన్న ప్రత్యేక రూపే లాంజ్లలో ప్రత్యేక సౌకర్యాలు లభిస్తాయి. కొత్త నియమాలు వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి.“ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టీ3 డిపార్చర్ టెర్మినల్‌లో రూపే ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. బోర్డింగ్ గేట్ నంబర్ 41 వద్ద డిపార్చర్ పీర్ 11, టీ3డీ దగ్గర ఇది రూపే మొట్టమొదటి ప్రత్యేక లాంజ్. రూపే ప్రత్యేక లాంజ్ అనేక రకాల ఆహారం, పానీయాలు, వినోదాలను అందిస్తుంది" అని ఎన్పీసీఐ పేర్కొంది.నూతన మార్గదర్శకాల ప్రకారం, రూపే క్రెడిట్‌కార్డు యూజర్లకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ చేసే వ్యయం ఆధారంగా నిర్ణయించారు. రూ.10,000 నుంచి రూ.50,000 ఖర్చు చేస్తే మూడు నెలల్లో లాంజ్‌ను రెండు సార్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. రూ.50,001 నుంచి రూ.లక్ష వరకూ వ్యయంపై నాలుగు సార్లు ఉచిత యాక్సెస్ ఉంటుంది. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు వరకూ అయితే 8, రూ.5 లక్షలకుపైన ఖర్చే చేస్తే అపరిమిత లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: మామూలు బ్యాంక్ బ్యాలెన్స్‌పైనా ఎక్కువ వడ్డీ!ఇటీవల పలు విమానాశ్రయ లాంజ్‌లు రూపే కార్డులను స్వీకరించడం ప్రారంభించాయి. యూపీఐలో క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించిన తర్వాత రూపే కార్డ్‌ల జారీ పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 3లో రూపే తన మొదటి ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేసింది. -
ఇక మద్యంపైనా రేషన్!
దేశంలోని అన్ని విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి లాంజిలలో ఇచ్చే మద్యం మీద ఇక రేషన్ పెట్టాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. దూర ప్రయాణాలు చేసేవాళ్లలో కొంతమంది ప్రయాణికులు తోటివారి పట్ల, సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో డిపార్చర్ టెర్మినల్స్ వద్ద వారికి ఇచ్చే మద్యం కోటాను తగ్గించాలని ఇటీవలి కాలంలో పలు భారతీయ విమానయాన సంస్థలు పౌర విమానయాన అధికారులను కోరాయి. దాంతో ఎయిర్ ఇండియా కూడా ఇదే బాటలో.. మద్యం కోటాను తగ్గించాలని నిర్ణయించింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశాలకు బిజినెస్, ఫస్ట్ క్లాస్‌లలో ప్రయాణాలు చేసేవారికి లాంజిలలో వోడ్కా, విస్కీ, రమ్ లాంటి డ్రింకులైతే గరిష్ఠంగా మూడు పెగ్గులు మాత్రమే ఇస్తామని, అదే వైన్ అయితే రెండు గ్లాసులు, బీర్ అయితే మూడు బాటిల్స్ మాత్రమే ఇస్తామని ఎయిరిండియా తెలిపింది. వీటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే ప్రయాణికులు ఎంచుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి కనెక్టింగ్ స్వదేశీ విమానాల్లో ప్రయాణించేవారికి మాత్రం మద్యాన్ని ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంటే ముంబై నుంచి ఢిల్లీ వచ్చి, అక్కడి నుంచి లండన్ వెళ్లే ప్రయాణికులకు ముంబైలో మద్యం ఇవ్వరన్నమాట. ఈ ఉత్తర్వులను ఎయిరిండియా ఇచ్చింది తప్ప విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు చూస్తన్న జీఎంఆర్ సంస్థ కాదని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ఎయిరిండియా ఇలాంటి ఉత్తర్వులను విడుదల చేసింది. తాము కూడా ఇలాంటి నియంత్రణలను అమలుచేస్తున్నట్లు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఇక ముంబైలో అయితే, విస్కీ, వోడ్కా, రమ్, జిన్ లాంటి డ్రింకులు మూడు పెగ్గులలో కూడా 45 మిల్లీలీటర్లకు బదులు 30 మిల్లీలీటర్లు మాత్రమే ఇస్తున్నారు. బీరు మాత్రం మూడు సీసాలు ఇస్తారు. విదేశాల్లోని విమానాశ్రయాల్లో కూడా ఇలాంటి బోర్డులు కనిపిస్తాయని ఎయిరిండియా అధికారి ఒకరు తెలిపారు.