కేవైసీ అప్‏డేట్ పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

RBI tells banks not to impose any restriction till 31 December - Sakshi

న్యూఢిల్లీ: దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆప్ ఇండియా(ఆర్‌బీఐ) కేవైసీ అప్‏డేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న కారణంగా 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్‏డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు ,ఇతర ఆర్థిక సంస్థలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. నేడు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు.

వినియోగదారుల ఖాతాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం కేవైసీ అప్‏డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో సూచించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు కేవైసీ అప్‏డేట్ చేసుకోవాలని కస్టమర్లను ఇటీవల కోరాయి. ఇందుకోసం మే 31 వరకు గడువును విధించాయి. అయితే ఆర్‌బీఐ మాత్రం తాజాగా కేవైసీ అప్ డేట్ గడువును డిసెంబర్ చివరి వరకు పొడగిస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్ డేట్ చేసుకోకపోయిన కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరంతరంగా వారు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

చదవండి:

అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్‌’ ముప్పు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top