ఐడీఎఫ్‌సీ విలీనానికి ఆర్‌బీఐ అనుమతి | RBI approves IDFC IDFC First Bank merger | Sakshi
Sakshi News home page

ఐడీఎఫ్‌సీ విలీనానికి ఆర్‌బీఐ అనుమతి

Dec 28 2023 7:48 AM | Updated on Dec 28 2023 7:48 AM

RBI approves IDFC IDFC First Bank merger - Sakshi

న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐడీఎఫ్‌సీ ఎఫ్‌హెచ్‌సీఎల్‌) విలీనానికి ఆర్‌బీఐ తన అనుమతి తెలియజేసింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ ద్వారా ఐడీఎఫ్‌సీ వాటాలు కలిగి ఉంది.

ఇప్పుడు రివర్స్‌ మెర్జర్‌ విధానంలో బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ విలీనం కానుంది. ఈ విలీన ప్రక్రియకు ఆర్‌బీఐ నిరభ్యంతరాన్ని (నో అబ్జెక్షన్‌) తెలియజేసినట్టు ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు వెల్లడించింది. తొలుత ఐడీఎఫ్‌సీ లిమిటెడ్‌లో ఐడీఎఫ్‌సీ ఎఫ్‌హెచ్‌సీఎల్‌ విలీనం అవుతుంది.

అనంతరం ఐడీఎఫ్‌సీ వెళ్లి ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో విలీనం అవుతుంది. ఐడీఎఫ్‌సీ వాటాదారుల వద్దనున్న ప్రతి 100 షేర్లకు గాను 155 బ్యాంక్‌ షేర్లు లభించనున్నాయి. విలీనం అనంతరం ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ పుస్తక విలువ 4.9 శాతం పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement