
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన క్వాంటమ్ ఎనర్జీ.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రెంటల్ కంపెనీ (అద్దెకు ఇచ్చే) అయిన స్కూఈవీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్వాంటమ్ ఎనర్జీ 1,000 యూనిట్ల ‘బిజినెస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను సమకూర్చనుంది.
ఈ భాగస్వామ్యంపై క్వాంటమ్ ఎనర్జీ డైరెక్టర్ చేతన చుక్కపల్లి మాట్లాడుతూ.. ఈ కామర్స్ విభాగంలో పెరుగుతున్న డెలివరీ అవసరాలకు మెరుగైన పరిష్కారాలను అందించాలన్న ప్రయత్నమే స్కూఈవీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంలో ఉద్దేశ్యమని చెప్పారు.
లాస్ట్‌మైల్ డెలివరీని ఎలక్ట్రిక్‌గా మార్చడమే తమ సంయుక్త కృషి అని, ఇది బీటూబీ విభాగం మరింత బలోపేతానికి తోడ్పడుతుందన్నారు. బీటూబీ అవసరాలకు వీలుగా అత్యంత సమర్థతతో కూడిన, మన్నికైన ఈ–బైక్‌లను అందించడంలో క్వాంటమ్ ఎనర్జీ తమకు కీలక భాగస్వామి అని స్కూఈవీ రెంటల్స్ సీఈవో అమిత్ పేర్కొన్నారు.