పాలీసైక్ల్‌తో రీ సస్టెయినబిలిటీ జట్టు | PolyCycl and Re Sustainability forge strategic partnership | Sakshi
Sakshi News home page

పాలీసైక్ల్‌తో రీ సస్టెయినబిలిటీ జట్టు

Published Tue, Oct 31 2023 5:46 AM | Last Updated on Tue, Oct 31 2023 5:46 AM

PolyCycl and Re Sustainability forge strategic partnership - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యర్ధాల నిర్వహణ సంస్థ రీ సస్టెయినబిలిటీ (గతంలో రామ్‌కీ ఎన్విరో ఇంజినీర్స్‌) తాజాగా పాలీసైక్ల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో జట్టు కట్టింది. ప్లాస్టిక్‌ రసాయనాల రీసైక్లింగ్‌ కోసం దేశీయంగా ఫీడ్‌స్టాక్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్టు కింద తక్కువ గ్రేడ్‌ ప్లాస్టిక్స్‌ను సేకరించి పాలీసైకిల్, దాని భాగస్వామ్య సంస్థల కెమికల్‌ రీసైక్లింగ్‌ ప్రాజెక్టుల కోసం ఫీడ్‌స్టాక్‌ను సిద్ధం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా ఢిల్లీలో తొలి సారి్టంగ్, ప్రీ–ప్రాసెసింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు తోడ్పడగలవని రీ సస్టెయినబిలిటీ సీఈవో మసూద్‌ మలిక్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement