
భారత ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఐపీఓ కోసం కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్ దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఐపీఓ పరిమాణం రూ.10,000-13,000 కోట్ల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఐపీఓ ఇప్పటి వరకు భారతదేశం అతిపెద్ద ఫిన్‌టెక్ లిస్టింగ్‌ల్లో ఒకటిగా మారుతుందని కొందరు అంటున్నారు.
కంపెనీ విస్తరణకు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ల కోసం, కొత్త సర్వీసులు అందించేందుకు మూలధనాన్ని సమీకరించడానికి ఫోన్‌పేకు ఈ పబ్లిక్ ఇష్యూ సహాయపడుతుంది. ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో ప్రారంభ పెట్టుబడిదారులు తమ వాటాలు విక్రయించే అవకాశం ఉంటుంది.
ఫోన్‌పేలో మెజారిటీ వాటా కలిగిఉన్న వాల్‌మార్ట్ పెద్దంగా తన వాటాను విక్రయించే అవకాశం లేదనే అభిప్రాయాలున్నాయి. ఇతర ఇన్వెస్టర్లుగా ఉన్న టైగర్ గ్లోబల్, జనరల్ అట్లాంటిక్ వంటివి కొంతమేరకు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చనే అంచనాలున్నాయి. భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఎకోసిస్టమ్‌లో ఫోన్‌పే 45% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది గూగుల్ పే, పేటీఎం వంటి ప్రత్యర్థుల కంటే చాలా ముందంజలో ఉంది. ఏప్రిల్ 2025లో కంపెనీను ఫోన్‌పే లిమిటెడ్‌గా పునర్వ్యవస్థీకరించారు.
ఇదీ చదవండి: వైట్‌హౌజ్‌లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు