
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి వైట్‌హౌజ్‌లో ప్రముఖ టెక్ కంపెనీ సీఈఓలతో హైప్రొఫైల్ విందును నిర్వహించారు. రోజ్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా ప్రతిష్టాత్మక కంపెనీ అధినేతల సరసన అక్కడి సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారత సంతతి సీఈఓలు సైతం పాల్గొన్నారు.
విందుకు హాజరైన భారత సంతతి సీఈవోలు
సుందర్ పిచాయ్ - గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ
సత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్ సీఈఓ
సంజయ్ మెహ్రోత్రా - మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ
వివేక్ రణదివే - టిబ్కో సాఫ్ట్‌వేర్ ఛైర్మన్
శ్యామ్ శంకర్ - పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్
ఈ విందుకు సంబంధించిన పూర్తి అజెండాను వైట్ హౌజ్ విడుదల చేయనప్పటికీ కింది కీలక అంశాలపై చర్చించినట్లు అంచనాలు వెలువడుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాతీయ భద్రత
సెమీకండక్టర్, చిప్ తయారీలో అమెరికా పోటీతత్వం
ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, హైస్కిల్డ్ వీసాలు (హెచ్1-బీ)
సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత
యూఎస్-ఇండియా టెక్ సహకారం, సరఫరా గొలుసులపై ప్రభావం
అతిథుల జాబితాలోని ప్రముఖ కంపెనీ సీఈవోలు
పేరు | కంపెనీ |
---|---|
బిల్ గేట్స్ | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు |
టిమ్ కుక్ | యాపిల్ సీఈఓ |
మార్క్ జుకర్‌బర్గ్ | మెటా సీఈఓ |
సెర్గీ బ్రిన్ | గూగుల్ సహ వ్యవస్థాపకుడు |
సామ్ ఆల్ట్ మన్ | ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు |
గ్రెగ్ బ్రోక్ మన్ | ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు |
సఫ్రా కాట్జ్ | ఒరాకిల్ సీఈఓ |
డేవిడ్ లింప్ | బ్లూ ఆరిజిన్ సీఈఓ |
అలెగ్జాండర్ వాంగ్ | స్కేల్ ఏఐ సీఈఓ |
జారెడ్ ఐజాక్ మన్ | షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ |
ఎలాన్ మస్క్ గైర్హాజరు
టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ విందుకు గైర్హాజరయ్యారు. ఒకప్పుడు ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన మస్క్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొద్దికాలంపాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్‌తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇటీవల అమెరికా దిగ్గజ కంపెనీలకు ట్రంప్ దేశీయంగా పెట్టుబడులు పెంచాలని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో కాకుండా యూఎస్ చేసే పెట్టుబడులు, మూలధన వ్యయాలు పెంచాలని సూచించారు. అందుకు ఇతర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించాలనుకునే కొన్ని కంపెనీలు వెనక్కి తగ్గి యూఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా కంపెనీల సీఈఓలకు విందు ఏర్పాటు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం