పేటీఎమ్‌ నుంచి ఆల్‌-ఇన్‌-వన్‌ పీవోస్‌ చెల్లింపుల వ్యవస్థ

Paytm Introduces All In One Pos Machine - Sakshi

ప్రముఖ డిజటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ వ్యాపారుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని తీసుకువచ్చింది. పేటీఎమ్‌ ఆల్-ఇన్-వన్ పీవోఎస్‌ మెషిన్ తో చిన్నవ్యాపారులు ఈ-కామర్స్ సహచరులైపోతారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  పీవోఎస్‌ మెషిన్‌తో చిన్న వ్యాపారులు ఈ-కామర్స్‌ సంస్ధల తరహాలో నో-కాస్ట్‌, ఈఎంఐ, బ్యాంక్‌ ఆఫర్లను, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను తమ కస్టమర్లకు అందించవచ్చును. తన ఆల్-ఇన్-వన్ పీవోఎస్‌ ఉపకరణాలతో ఈఎమ్‌ఐ ఆఫర్లు, ప్రముఖ బ్యాంక్ లు, భాగస్వామి బ్రాండ్ ల నుంచి క్యాష్ బ్యాక్ లతో దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారులు, రిటైలర్లతో సహా వ్యాపా రులందరికీ సాధికారికత కల్పిస్తున్నట్లు భారతదేశ అగ్రగామి డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ ఫామ్ పేటీఎమ్‌ ప్రకటించింది.

పేటీఎమ్‌ వాలెట్, క్యూఆర్ కోడ్స్ ద్వారా అన్ని యూపీఐ యాప్స్, క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వా రా చెల్లింపులు స్వీకరించేందుకు ఆల్-ఇన్-వన్ పీవోఎస్‌ వీలు కల్పిస్తుంది. ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లోని ఎంతో మంది దుకాణదారులు, చిన్న వ్యాపారాల యజమానులు ఇప్పటికే పేటీఎమ్‌ ఆల్-ఇన్-వన్ పీవోఎస్‌ ఉపకరణాలను  వినియోగిస్తున్నారు. పలు అగ్రగామి బ్యాంకులతో పేటియం ఒప్పందాలను కుదుర్చుకుంది. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పాదనలపై ఆ కర్షణీయ డిస్కౌంట్లు అందించేందుకు ప్రముఖ బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చకుంది.

ఈ సందర్భంగా పేటీఎమ్‌ అధికారప్రతినిధి మాట్లాడుతూ, ‘‘ఆఫ్ లైన్ దుకాణదారులు, రిటైల ర్లతో సహా వ్యాపారులంతా కూడా  లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవ స్థలో అతి ముఖ్యభాగంగా ఉన్నారు. పేటీఎమ్‌  ఆల్-ఇన్-వన్ పీవోఎస్‌ ఉపకరణంతో మేం వారికి ఈ-కామర్స్ సంస్థలు ఆన్ లైన్ లో అందించే డిస్కౌంట్లు, బ్యాంక్ డీ ల్స్ అందించేలా చేయగలుగుతున్నాం. అంతేకాకుండా వారు, సాంకేతికతపై లేదా బ్యాక్ ఎండ్ మౌలిక వసతులపై ఎలాంటి పెట్టుబడి లేకుండానే తమ వ్యాపార కార్యకలాపాలను సులభంగా డిజిటైలైజ్ చేసుకోవచ్చును. వ్యాపారులు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, డిజిటల్ ఇండియా మిషన్ లో వారు చేరేందుకు తోడ్పడేందుకు ఎంతో అవసరమైన డిజిటైలైజేషన్‌కు మా ఉపకరణాలు తోడ్పడతాయ’’ని అన్నారు.

ఈ ఆల్ –ఇన్-వన్ పీవోఎస్‌ ఉపకరణం కార్డ్ స్వైప్ నుంచి, క్యూఆర్ కోడ్స్ నుంచి చెల్లింపు లను ఆమోదిస్తుంది. జీఎస్టీ కాంప్లియెంట్ బిల్లులను అందించేందుకు అది ‘పేటీఎమ్‌ ఫర్ బిజి నెస్’ యాప్ తో ఇంటిగ్రేట్ చేశారు. అన్ని లావాదేవీలను, సెటిల్ మెంట్స్ ను కూడా వ్యాపారులు నిర్వహించుకోగలుగుతారు. అంతేకాకుండా రుణాలు, బీమా వంటి వివిధ వ్యాపార సేవలు, ఆర్థిక పరిష్కారాలను పొందడంలో ‘పేటీఎమ్‌ ఫర్ బిజి నెస్’ యాప్ వ్యాపారులకు తోడ్పడుతుంది. క్రెడిట్‌ సేల్స్‌, నగదు విక్రయాలు, కార్డు విక్రయాలతో సహా తమ లావాదేవీలన్నింటినీ నిర్వహించుకునేందుకు ‘బిజినెస్ ఖాతా’ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top