Panasonic Robotic Camera 4K 1 MOS Sensor, Check Price And Other Details - Sakshi
Sakshi News home page

రోబోటిక్‌ వీడియో కెమెరా: ధర తెలిస్తే షాకవుతారు

Apr 30 2023 12:24 PM | Updated on Apr 30 2023 1:58 PM

Panasonic robotic Camera 4K 1 MOS Sensor check details - Sakshi

సాక్షి, ముంబై: జపానీస్‌ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ కంపెనీ ‘పానసోనిక్‌’ కొత్తగా రోబోటిక్‌ వీడియో కెమెరాను విడుదల చేసింది. ‘ఏడబ్ల్యూ–యూఈ 160 యూహెచ్‌డీ 4కే 1 ఎంఓఎస్‌ పీటీజ్‌’ పేరుతో విడుదల చేసిన ఈ కెమెరా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యంత స్పష్టమైన చిత్రాలను, వీడియోలను తీయగలదు. ఇందులో ఎంఓఎస్‌ సెన్సర్, లో పాస్‌ ఫిల్టర్, హైస్పీడ్‌ ఫ్రేమ్‌ రేట్స్‌ వంటి అధునాతన ఫీచర్స్‌ ఉన్నాయి.

పరిసరాల్లోని వెలుగు నీడలకు అనుగుణంగా ఈ కెమెరా తనను తానే సర్దుకుని స్పష్టమైన వీడియోలను చిత్రించగలదు. జూమ్, టిల్ట్‌ వంటివి రిమోట్‌తో నియంత్రించవచ్చు. ఇది స్లోమోషన్‌ వీడియోలను కూడా పూర్తి స్పష్టతతో తీయగలదు. ఈ కెమెరాకు సంబంధించిన యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే, దాని ద్వారా కెమెరా పనితీరును సులువుగా నియంత్రించుకోవచ్చు. దీని ధర 14,495 డాలర్లు (రూ.11.93 లక్షలు). 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement