ఆర్బీఐ కీలక నిర్ణయం.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌! | A Pact Between India And Singapore On Payments Interface | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కీలక నిర్ణయం.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌!

Sep 15 2021 11:05 AM | Updated on Sep 15 2021 2:37 PM

A Pact Between India And Singapore On Payments Interface - Sakshi

ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపేందుకు వీలుగా ఒప్పందాలు చేసుకుంటోంది.

జీ 20 దేశాలతో
యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ సౌకర్యం 2016లో అందుబాటులోకి వచ్చింది. ఆరంభంలో అడుగులు నెమ్మదిగా పడినా ఇప్పుడు యూపీఐ పేమెంట్స్‌ సర్వసాధారణ విషయంగా మారింది. టీ కొట్టు, పాన్‌ డబ్బా దగ్గర కూడా యూపీఐ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. అయితే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం ఇబ్బందిగా మారింది. ఈ కష్టాలు తొలగించే దిశగా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా తొలుత జీ 20 దేశాలతో ఈ మేరకు అవగాహనకు రావాలని నిర్ణయించింది.

తొలుత సింగపూర్‌
భారత్‌ , సింగపూర్‌ దేశాల మధ్య ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్‌ ‍బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మానేటరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇండియాలోని యూపీఐ యూజర్లు సింగపూర్‌లో ఉన్న పే నౌ యౌజర్లతో తేలికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. 2022 జులై నుంచి ఇండియా, సింగపూర్‌ దేశాల మధ్య యూపీఐ  చెల్లింపుల నిర్ణయం అమల్లోకి రానుంది.

చదవండి : RBI New Rule: ఆటోమేటిక్‌ కట్టింగ్‌లతో రెన్యువల్‌ ఇక నడవదు.. ఇలా చేయాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement