వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : ఉద్యోగులకు భారీ షాక్‌!!

Over 90percent tech firms are preferring hybrid work model - Sakshi

దేశీయంగా ఉన్న 93శాతం టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు భారీ షాకిచ‍్చాయి. కరోనా ప్రభావం లేకపోవడంతో సంస్థలు ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని మెయిల్స్‌ పంపిస‍్తున్న విషయం తెలిసిందే. అయితే సంస్థల నుంచి మెయిల్స్‌ రావడంతో 72శాతం మంది ఉద్యోగులు తమకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కావాలని కోరుతున్నారు. కానీ సంస్థలు మాత్రం అందుకే ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఆఫీస్‌కు రావాలని, లేదంటే హైబ్రిడ్‌ వర్క్‌ చేయాల్సిందేనని ఉద్యోగుల్ని అదేశిస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విషయంలో అటు ఉద్యోగులు ఇటు సంస్థల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గూగుల్‌,ట్విట్టర్‌లు వర్క్‌ విషయంలో ఉద్యోగుల్ని ఒత్తిడి చేయమని స్పష్టం చేస్తుండగా..దేశీయ టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని ఆఫీస్‌లకు రప్పిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగులు మాత్రం తమకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని కోరుతుండగా..కంపెనీలు మాత్రం ఐబ్రిడ్‌ వర్క్‌ను అలావాటు చేస్తున్నట్లు నాస్కామ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నాస్కామ్ రూపొందించిన "టెక్నాలజీ రీషేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇండియా ప్రాస్పెక్టీవ్‌ అనే విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. దీంతో పాటు అనేక అసక్తికర విషయాలు ఈ నివేదిక హైలెట్‌ చేసింది. 

హైబ్రిడ్ వర్క్ మోడల్

►"ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇండియా ఔట్‌లుక్" రిపోర్ట్‌లో మనదేశానికి చెందిన 70శాతం టెక్‌ కంపెనీలు  హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అవలంబించాయని, 85 శాతం మంది రిమోట్‌గా లేదా హైబ్రిడ్ వర్క్‌లో పనిచేస్తున్నారని నివేదిక పేర్కొంది. 

►"దాదాపు 63 శాతం సంస్థలు హైబ్రిడ్ క్లౌడ్ సేవలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి.  

►"సర్వేలో పాల్గొన్న దాదాపు 74 శాతం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ కొనసాగించాలని కోరుతున్నారు.  

►"93 శాతం టెక్ సంస్థలు మహమ్మారికి మించి హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరించాలని చూస్తున్నాయి.

భవిష్యత్‌ అంతా టెక్నాలజీదే
 

► నివేదిక ప్రకారం, మహమ్మారి కారణంగా వర్క్‌ కల్చర్‌ మార్చేందుకు అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని 92 శాతం సంస్థలు విశ్వసిస్తున్నాయి.

► టెక్ ఇండస్ట్రీలో 90 శాతానికి పైగా ఉద్యోగులు కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన 2 నుంచి మూడు వారాల లోపే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడం ప్రారంభించారు.
 

చదవండి: ఉద్యోగులకు ఫ్రీడమ్‌ ఇద్దాం.. సుందర్‌ పిచాయ్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top