Ola Electric scooter: మీరు తెలుసుకోవాల్సిన 10 ఆసక్తికర విషయాలు!

Ola Electric scooter: This 10 Things You Need To Know - Sakshi

ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొని రావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఇప్పటికే తన అధికారిక వెబ్ సైట్ ద్వారా త్వరలో రాబోయే ఎలక్ట్రిక్ టూ వీలర్ కోసం ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రాబోయే కొన్ని వారాల్లో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆ స్కూటర్ ను లాంచ్ చేయడానికి సిద్దంగా ఉంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లో లక్షకు పైగా బుకింగ్స్ ను నమోదు చేసింది. కంపెనీ తన అధికారిక వెబ్ సైట్లో ₹499 టోకెన్ మొత్తంలో జూలై 15న బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అధికారికంగా విడుదల కావడానికి ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు గురుంచి ఇప్పడు తెలుసుకుందాం.

  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కంపెనీ నుంచి వచ్చే మొట్టమొదటి ద్విచక్ర వాహన ప్యాసింజర్ వేహికల్ ఇదే. తమిళనాడులో నిర్మిస్తున్న ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఈ-స్కూటర్లకు ప్రపంచంలోనే అతిపెద్ద సదుపాయంగా ఉంటుంది. ఇక్కడ ఓలా ఎలక్ట్రిక్ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తుంది. ₹2,400 కోట్ల వ్యయంతో 500 ఎకరాల్లో నిర్మిస్తున్న మెగా ఫ్యాక్టరీలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల యూనిట్లను పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని సంస్థ హామీ ఇచ్చింది.

  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను రెండు వేరియెంట్లలో అందించే అవకాశం ఉంది. కొత్త ఫైలింగ్ చేసిన డాక్యుమెంట్ల ప్రకారం స్కూటర్లను ఎస్ సిరీస్ అని పిలిచే అవకాశం ఉంది. ఈ ఎస్ సిరీస్ లో భాగంగా ఎస్1, ఎస్1 ప్రో మోడళ్లను మార్కెట్లోకి తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ఎస్1 మోడల్ ధరతో పోలిస్తే ఎస్1 ప్రో ధర కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇందులోని ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉండనున్నాయి.
  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎటెర్గో స్కూటర్ ఆధారంగా తయారు చేశారు. ఇది అధిక శక్తిగల బ్యాటరీతో పనిచేస్తుంది. రీఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఒకసారి చార్జ్ చేస్తే 240 కిలోమీటర్లు పరిగెత్తగల సామర్థ్యం ఉందని పేర్కొంది. అయితే, వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో సింగిల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు దూరం వెళ్లే అవకాశం ఉంది.

  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 3 కెడబ్ల్యు నుంచి 6 కెడబ్ల్యు సామర్ధ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా నడిచే అవకాశం ఉంది. ఇది సుమారు 50 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు.
  • ఈ స్కూటర్ కేవలం 18 నిమిషాల్లో 0 నుండి 50% వరకు బ్యాటరీని ఛార్జ్ చేయగలదు. పూర్తిగా రీఛార్జ్ కావడానికి సుమారు 2 గంటల 30 నిమిషాలు అవసరం అవుతుంది. అయితే, ఒకవేళ రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ పాయింట్ ద్వారా చార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ టూ వీలర్ 0 నుంచి 100% చేరుకోవడానికి ఐదున్నర గంటల వరకు పట్టవచ్చు.
  • ఓలా తన కస్టమర్ల కోసం హోమ్ ఛార్జర్ తో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ అందించే అవకాశం ఉంది. దీనికి ఎలాంటి ఇన్ స్టలేషన్ అవసరం లేదు. రెగ్యులర్ వాల్ సాకెట్ లోకి ప్లగ్ చేయడం ద్వారా కస్టమర్లు తమ వాహనాన్ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ యాప్ ఉపయోగించి రియల్ టైమ్ లో ఛార్జింగ్ స్టేటస్ మానిటర్ చేయడం కొరకు ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్లకు తమ స్కూటర్లలో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీని అందిస్తుంది. దీని ద్వారా డబ్బులు కూడా చెల్లించవచ్చు.

  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అతిపెద్ద-ఇన్-క్లాస్ బూట్ స్పేస్, యాప్ ఆధారిత కీలెస్ యాక్సెస్, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, లగేజీని తీసుకెళ్లడానికి ఒక హుక్, స్ప్లిట్-టైప్ రియర్ గ్రాబ్ హ్యాండిల్స్, సింగిల్-పీస్ సీటు, ఎక్స్ టర్నల్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, టెయిల్ లైట్, బ్లాక్ కలర్ ఫ్లోర్ మ్యాట్, పూర్తిగా డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ పొందవచ్చు.
  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు 10 కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ వంటి ఈ రంగుల స్కూటర్లు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయి. మేల్‌, ఫిమేల్‌ కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్టుగా ఈ కలర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది.

  • ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 'హైపర్ ఛార్జర్ నెట్ వర్క్'ను ఇన్ స్టాల్ చేస్తుంది. ఈ నెట్ వర్క్ కింద 400 నగరాల్లో లక్ష ఛార్జింగ్ పాయింట్లు ఉండనున్నాయి. మొదటి సంవత్సరంలో ఓలా భారతదేశంలోని 100 నగరాల్లో 5000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తోంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులకు ఇది సహాయపడుతుంది.

  • ఓలా యొక్క ఈ-స్కూటర్ ధర  1.2లక్షల నుంచి ₹1.4 లక్షల(ఎక్స్ షోరూమ్) శ్రేణిలో ఉంటుంది. స్కూటర్‌ని బుక్‌ చేసుకున్న కస్టమర్లకు నేరుగా ఇంటికే హోం డెలివరీ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ప్రత్యర్థులతో తలపడనుంది.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top