Ola Electric Revenue: వావ్! ఓలా ఎలక్ట్రిక్‌ అమ్మకాలు తగ్గినా.. కళ్లు తిరిగే ఆదాయం 

Ola Electric crosses Rs 500 cr revenue in Apr May - Sakshi

రెండు నెలల్లో రూ. 500 కోట్లు 

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి రెండు నెలల్లో రూ. 500 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఏడాది చివరికల్లా బిలియన్‌ డాలర్ల(రూ. 7,800 కోట్లు) ఆదాయం అందుకోగల మని కంపెనీ భావి స్తోంది. అయితే తొలి రెండు నెలల్లో ఎన్ని వాహనా లు విక్రయించిందీ వెల్లడించలేదు.

ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో కస్టమర్ల విశ్వాసం పెరుగుతున్నదని, దీంతో భవిష్యత్‌లో మరింత పురోభివృద్ధిని సాధించగలదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. రోజుకి 1,000 వాహనాలను తయారుచేయగల కృష్ణగిరిలోని ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో తయారీ కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే భారీ ఆర్డర్లను పొందిందని, ఇకపై మరింత వేగాన్ని చూపే వీలున్నదని తెలియజేసింది.

కాగా వాహన రిజిస్ట్రేషన్‌ గణాంకాల ప్రకారం ఓలా ఎస్‌1 ప్రో  రిజిస్ట్రేషన్‌ 12,683 యూనిట్ల నుంచి 9,196 యూనిట్లకు క్షీణించాయి. ఇప్పటివరకూ కంపెనీ 50,000 స్కూటర్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్లు వెల్లడించింది. గతేడాది ఆగస్ట్‌లో కంపెనీ ఎస్‌1, ఎస్‌1 ప్రో బ్రాండుతో ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top