నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక అవార్డు! | Nita Ambani Receives Prestigious Award in the United States | Sakshi
Sakshi News home page

నీతా అంబానీకి అమెరికాలో ప్రతిష్ఠాత్మక అవార్డు!

Jul 3 2026 6:38 PM | Updated on Jul 3 2026 7:09 PM

Nita Ambani Receives Prestigious Award in the United States

రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు అయిన నీతా అంబానీ అమెరికాలో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. ఫ్లోరిడాలోని టాంపా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) ఆమెకు హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేశారు.

ఈ అవార్డును ప్రధానంగా ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజ అభివృద్ధి వంటి రంగాల్లో అసాధారణ సేవలు చేసిన వ్యక్తులను గౌరవించడానికి ఇస్తారు. నీతా అంబానీ ఈ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించారు. ముఖ్యంగా సామాజిక సేవ, దాతృత్వ కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం ఆమె చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఇదే కార్యక్రమంలో.. టాంపా మేయర్ జేన్ కాస్టర్, నీతా అంబానీకి ‘కీ టు ది సిటీ ఆఫ్ టాంపా’ను బహూకరించారు. ఇది అమెరికా అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటి. సేవలను, వ్యక్తిత్వానికి, మానవతా దృక్పథం వంటి వాటికి గౌరవంగా 'ఈ నగరం మీకు స్వాగతం పలుకుతోంది' అనే సంకేతంగా ఈ గుర్తింపును ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement