ప్రారంభమైన జీఎస్‌టీ మండలి సమావేశం

Nirmala Sitharaman to chair GST Council meeting in Lucknow - Sakshi

20 నెలల తర్వాత భౌతికంగా తొలి భేటీ

జీఎస్‌టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులపై చర్చ

కోవిడ్‌ ఔషధాలు, ఉత్పత్తులపై పన్ను మినహాయింపు పొడిగింపు!  

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి– జీఎస్‌టీ కౌన్సిల్‌ 45వ సమావేశం శుక్రవారం లక్నోలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన ప్రారంభమైంది. 20 నెలల తర్వాత మొదటి భౌతిక సమావేశం ఇది. కోవిడ్‌–19 లాక్‌డౌన్‌కు ముందు 2019 డిసెంబర్‌ 18న జీఎస్‌టీ కౌన్సిల్‌ భౌతికంగా సమావేశం అయ్యింది. అన్ని పరోక్ష పన్నులను ఒకటిగా చేస్తూ, 2017 జూలై 1వ తేదీ నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, సహజ వాయువు, క్రూడ్‌ను ఈ విధానం నుంచి మినహాయించారు. ప్రస్తుతం నెలకు రూ.లక్ష కోట్లకు పైగా జీఎస్‌టీ వసూళ్లు జరుగుతున్నాయి.
(చదవండి: పెట్రోల్-డీజిల్ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?)

మండలి చర్చించే కీలక అంశాల్లో కొన్ని..!
► పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోనికి తేవడం.  
► పలు కోవిడ్‌ ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, వ్యాధి నిర్ధారణ కిట్లు తదితర పరికరాలు, ఉత్పత్తులపై ప్రస్తుతం అమలు జరుగుతున్న సుంకాలు, పన్ను మినహాయింపులను డిసెంబర్‌ 31 వరకూ  పొడిగింపు
► పొగాకువంటి సిన్‌ అండ్‌ డీమెరిట్‌ గూడ్స్‌పై సెస్‌ కొనసాగింపు, విధివిధానాలు  
► దాదాపు 50 వస్తువులపై పన్ను రేట్ల సమీక్ష.
► జొమాటో,  స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా తయారు చేసిన సరఫరాలపై ఐదు శాతం జీఎస్‌టీ పన్ను విధింపు.

చదవండి: అనూహ్యం.. ఇక ఫుడ్‌ డెలివరీ యాప్‌లకూ జీఎస్టీ!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top