AI Next Y2K moment for India's technology sector: Jayesh Ranjan - Sakshi
Sakshi News home page

‘AI’ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి.. జయేశ్‌ రంజన్‌ పిలుపు

Published Sat, Jul 8 2023 7:28 AM

Next Y2k Moment For India's It Technology Said Jayesh Ranjan - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ రంగంలో భారత్‌ వేగంగా పురోగమిస్తోందని తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం వై2కే సమస్య తలెత్తినప్పుడు దాని పరిష్కారానికి దేశీ ఐటీ సంస్థలు, నిపుణులు తోడ్పాటు అందించారని  పేర్కొన్నారు.

ప్రస్తుతం మళ్లీ వై2కే తరహాలో..ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ విభాగాల్లో వస్తున్న అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్‌ డిజిటల్‌ పరివర్తనపైన నిర్వహించిన ఐటీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా జయేశ్‌ రంజన్‌ ఈ విషయాలు చెప్పారు.

మరోవైపు, 2022–23లో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 31 శాతం వృద్ధి చెందాయని, ఉద్యోగాల కల్పన 16.2 శాతం పెరిగిందని, ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని సీఐఐ తెలంగాణ చైర్మన్‌ సి. శేఖర్‌ రెడ్డి తెలిపారు.   

Advertisement
 
Advertisement