మారుతి స్విఫ్ట్-2023 కమింగ్‌ సూన్‌: ఆకర్షణీయ, అప్‌డేటెడ్‌ ఫీచర్లతో

New 2023 Maruti Swift India Debut Could Be In January - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ కార్‌మేకర్‌ మారుతి సుజుకి  తన హ్యాచ్‌బ్యాక్‌  మారుతి స్విఫ్ట్  మోడల్‌లో  కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది. కొత్త డిజైన్‌, అప్‌డేట్స్‌,  ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌తో 2023 జనవరి నాటికి కొత్త తరం సుజుకి స్విఫ్ట్‌ను గ్లోబల్‌గా లాంచ్‌ చేయనుంది. అంతేకాదు 2023లో జరగనున్న ఆటోఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి.

రానున్నమారుతి స్విఫ్ట్ 2023లో గణనీయమైన కాస్మెటిక్ మార్పులు , ఫీచర్ అప్‌గ్రేడ్‌లు చేసే అవకాశం ఉందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో  ద్వైవార్షిక ఆటోమోటివ్ ఈవెంట్ జనవరి 13 నుండి ప్రారంభం కానుంది. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, కొత్త  సీ-ఎయిర్ స్ప్లిటర్‌లతో అప్‌డేట్‌ చేసిన బంపర్, కొత్త LED ఎలిమెంట్స్‌తో కూడిన స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లు , ఫ్రంట్ ఎండ్‌లో.. కొత్త ఫాగ్ ల్యాంప్,  డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కొత్త బాడీ ప్యానెల్స్, వీల్ ఆర్చ్‌లపై ఫాక్స్ ఎయిర్ వెంట్‌లు, బ్లాక్ అవుట్ పిల్లర్లు, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌తో రివైజ్ చేసినట్టు సమాచారం. దాదాపు కొత్త బాలెనో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే,  హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లో డిజైన్‌ చేసిందట. 

ఇంకా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ,లెదర్ సీట్లుతొపాటు ఆపిల్ కార్‌ప్లే ,ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి వాయిస్ అసిస్ట్ , OTA (ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు)తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (కొత్త స్మార్ట్‌ప్లే ప్రో+) ఉండవచ్చు. దీంతోపాటు 360 డిగ్రీల కెమెరా, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్-కీప్ అసిస్ట్ ,అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌ లాంటి ఇతర ఇంటీరియర్‌ అప్‌డేట్స్‌ను అందించనుంది.  

ఇక ఇంజీన్‌ విషయానికి వస్తే..1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌,  5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో ఉండవచ్చు.  దీంతో పాటు యూరప్‌తో సహా ఇతర మార్కెట్‌లలో విక్రయిస్తున్న 1.4 లీటర్ల బూస్టర్‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్  ఇంజీన్‌తో, కొత్త తరం సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్‌ను కూడా  ఇండియాలో ఆ విష్కరించనుందని అంచనా. అయితే కొత్త స్విఫ్ట్‌ అరంగేట్రంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top