ఈ-రూపీని ప్రారంభించిన మోదీ

Narendra Modi Launch e-Rupi Digital Payment System - Sakshi

e-RUPI Launch సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నగదు రహిత లావాదేవీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీటిని మరింత ప్రోత్సాహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఈ-రూపీ((E-RUPI))ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా దీనిని ప్రారంభించారు మోదీ. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు.

ఈ-రూపీ అంటే..
డిజిటల్‌ చెల్లింపులు సులభతరం చేసేందుకు ఈ-రూపీని తీసుకొచ్చారు. సేఫ్‌, సెక్యూర్‌ ఆధారంగా ఈ-రూపీ వినియోగం ఉండనుంది. ఈ-రూపీ విధానంలో వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. క్యూఆర్‌ కోడ్‌, ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ ఓచర్లను లబ్ధిదారుడికి పంపడం ద్వారా చెల్లింపులు జరుగుతాయి. బ్యాంక్‌ ఖాతాలు, కార్డులు, యాప్‌లతో సంబంధం లేకుండా వినియోగదారుడు లావాదేవీలు జరుపవచ్చు. దీనిలో మరో ప్రయోజనం ఏంటంటే కార్డు, పేమెంట్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top