లక్షలాది వైఫై రూటర్లలో సెక్యూరిటీ సమస్యలు, హెచ్చరిస్తున్న టెక్‌ నిపుణులు

Millions Of Wifi Routers At Risk Of 226 Security Vulnerabilities - Sakshi

సైబర్‌ నేరస్తులు పంథా మార్చారు. ఇన్ని రోజులు మెయిల్స్‌, మెసేజెస్‌, ఫ్రీగిఫ్ట్‌ లు పేరుతో బ్యాంక్‌ అకౌంట్‌లలో ఉన్న మనీని కాజేసేవారు. కానీ ఇప్పుడు రూటు మార్చి వైఫై రూటర్ల సాయంతో వైరస్‌ పంపి పర్సనల్‌ కంప్యూటర్లు, ఆఫీస్‌లో కంప్యూటర్లపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాడుల్లో వ్యక్తులు, లేదంటే సంస్థల రహస్యాల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిని అడ్డం పెట్టుకొని కావాల్సిన మొత్తాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని మిలియన్ల వైఫై రూటర్లలో సుమారు 226 భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెక్యూరిటీ రీసెర్చ్‌ సంస్థ 'ఐఓటీ ఇన్స్పెక్టర్‌', టెక‍్నాలజీ మ్యాగజైన్‌ 'చిప్‌' పలు నివేదికల్ని విడుదల చేసింది. నెట్‌గేర్‌, ఆసుస్‌, సినాలజీ,డీ - లింక్‌, ఏవీఎం,టీపీ -లింక్‌, ఇడి మ్యాక్స్‌ సంస్థల రూటర్లలో సెక్యూరిటీ సమస్యలు తలెత్తాయని, తద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు అవకాశం ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ సెక్యూరిటీ సమస్యలు వెలుగు రావడంతో సంబంధిత సంస్థలు.. ఆ సమస్యని పరిష్కరించినట్లు తెలుస్తోంది.   

ఈ సందర్భంగా ఐఓటీ ఇన్స్పెక్టర్‌ సంస్థ సీటీఓ ఫ్లోరియన్ లుకావ్స్కీ మాట్లాడుతూ.. మిలియన్ల రూటర్లలో తలెత్తిన 226 భద్రతా లోపాల వల్ల తలెత్తే నష్టం ఒకే విధంగా ఉంటుందని చెప్పలేం. కానీ అదే భద్రతా లోపాల్ని అడ్డంపెట్టుకొని హ్యాక్‌ చేయడం హ్యాకర్లకు చాలా సులభం' అవుతుందని అన్నారు. అయితే ఈ సమస్యలకు రూటర్లలో వినియోగించే కొత్త కాంపోనెంట్స్‌, ల్యూనిక్స్‌ కెర్నాల్‌ అనే ఆపరేటింగ్‌ స్టిస్టమ్‌ తో పాటు ఇతర డేటా సర్వీసులను టార్గెట్‌ చేసుకొని సైబర్‌ దాడులు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. 

సైబర్‌ దాడుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే 
ఇటీవల నార్డ్‌ పాస్‌ అనే సంస్థ  50 దేశాలకు చెందిన ప్రజలు ఎలాంటి పాస్‌వర్డ్‌లను వినియోగిస్తున్నారు. ఆ పాస్‌వర్డ్‌లను ఎంత సమయంలో హ్యాక్‌ చేయొచ్చు అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మనదేశానికి చెందిన ప్రజలు..సెకను కన్నా తక్కువ సమయంలో హ్యాక్‌ చేసే విధంగా పాస్‌ వర్డ్‌ అనే వర్డ్‌ను పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారని తేలింది. దీంతో పాటు 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567 పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటున్నట్లు నార్డ్‌ పాస్‌ పేర్కొంది. అలా కాకుండా కష్టతరమైన వర్డ్స్‌లేదంటే నెంబర్స్‌ పెట్టుకోవడం వల్ల వైఫై రూటర్ల ద్వారా జరిగే హ్యాకింగ్‌ నుంచి సురక్షింతంగా ఉండొచ్చని  ఫ్లోరియన్ లుకావ్స్కీ సూచించారు.

చదవండి : వాటిని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే..కొంప కొల్లేరే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top