Mozilla: హీరోల పేర్లు పెడితే..దొంగచేతికి తాళం ఇచ్చినట్లే

Mozilla Foundation study Passwords With Superhero Names Are Easily Hacked - Sakshi

మనలో చాలా మంది ఇంట్లో వాళ్ల పేర్లు, డేటా ఆఫ్‌ బర్త్‌లు నచ్చిన నెంబర్లను పాస్‌వర్డ్‌లుగా ఉపయోగిస్తుంటాం. మరికొందరు సైబర్‌ నేరస్తుల నుంచి సేఫ్‌గా ఉండేందుకు 123లు, abcdలను పాస్‌వర్డ్‌లుగా మార్చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రం వాళ్లకు నచ్చిన హీరోల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటుంటారు. అలా పెట్టుకోవడం చాలా ప్రమాదమని కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. హీరోల పేర్లు పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే 'దొంగ చేతికి తాళం' ఇచ్చిట్లవుతుందని తేలింది.

 

మోజిల్లా ఫౌండేషన్‌​ సంస్థ పాస్‌వర్డ్‌లపై రీసెర్చ్‌ నిర్వహించింది. ఆ రీసెర్చ్‌లో భాగంగా Haveibeenpwned.comలో దొరికిన వివరాల ఆధారంగా పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా సూపర్‌ మ్యాన్‌, బ్యాట్‌ మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌, వోల్వరైన్, ఐరన్‌ మ్యాన్‌, వండర్‌ ఉమెన్‌, డేర్‌ డెవిల్‌, థోర్‌, బ్లాక్‌ విడో, బ్లాక్‌ పంతార్‌ పేర్లను పెట్టుకున్న వారి అకౌంట్లు ఈజీగా హ్యక్‌ అయినట్ల వెల్లడించింది. వీరితో పాటు క్లార్క్‌ కెంట్‌, బ్రూసీ వ్యాన్‌, పీటర్‌ పార్కర్‌, హీరోల పేర‍్లతో పాటు ఫస్ట్‌ నేమ్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, 12345, ఏబీసీడీలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోవద్దని హెచ్చరించింది. అలా పెట్టుకున్న వారి అకౌంట్లు హ్యాక్‌ అయినట్లు స్పష్టం చేసింది.

 

మరి ఎలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి
హ్యాకర్ల చేతికి చిక్కకుండా ఉండాలంటే స్ట్రాంగ్‌  పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని మోజిల్లా ఫౌండేషన్‌ తెలిపింది. క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్‌తో పాటు '@#$*' ఇలా క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలని సూచించింది. 

మోస్ట్‌ డేంజరస్‌ పాస్‌వర్డ్‌లు ఇవే 
ఇక తాము నిర్వహించిన రీసెర్చ్‌లో '12345', '54321' పాస్‌వర్డ్‌లు అత్యంత ప్రమాదకరమని మోజిల్లా ప్రతినిధులు తెలిపారు. 2020లో పాస్‌వర్డ్ మేనేజర్ అయిన 'నార్డ్‌ పాస్‌' ప్రకారం '123456' మోస్ట్‌ డేంజరస్‌ పాస్‌వర్డ్‌ అని తెలిపింది. ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించిన అకౌంట్లను హ్యాకర్లు 23 మిలియన్ల సార్లు హ్యాక్ చేసినట్లు వెల్లడించింది.'123456789' లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే సెకన్ల వ్యవధిలో హ్యాక్‌ చేస్తారని నార్డ్‌ పాస్‌ తన నివేదికలో పేర్కొంది.

చదవండి: 18 వందల కోట్ల పాస్‌వర్డ్‌లపై దాడులు..! కొత్త వ్యూహంతో మైక్రోసాఫ్ట్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top