Microsoft Layoffs: ‘ఈ ఏడాది మొదట్లోనే ఐటీ ఉద్యోగులకు భారీ షాక్‌!’

Microsoft Set To Layoff Thousands Of Employees This Week - Sakshi

ఈ ఏడాది మొదట్లోనే ఐటీ ఉద్యోగులకు కంపెనీలు భారీ షాక్‌ ఇస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం భయంతో సంస్థలు ఉద్యోగుల్ని తొలగించుకుంటున్నాయి. జాబ్‌ నుంచి తొలగిస్తున్నట్లు హఠాత్తుగా మెయిల్స్‌ పంపిస్తున్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీల్లో 24వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపాయి. 

తాజాగా, కఠినమైన ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్‌ బెర్గ్‌ సైతం మైక్రోసాఫ్ట్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైందని తన నివేదికలో పేర్కొంది.

మరో 5 నుంచి 10శాతం ఉద్యోగాలు ఉష్ కాకి
మైక్రోసాఫ్ట్‌లో మొత్తం 220,000 మంది పనిచేస్తుండగా..గతేడాది రెండు సార్లు ఉద్యోగుల్ని ఫైర్‌ చేయగా.. తాజాగా కంపెనీ వార్షిక ఫలితాల్ని వెలు వరించకముందే ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ‘గత కొన్ని వారాలుగా మేం సేల్స్‌ఫోర్స్, అమెజాన్ నుండి గణనీయంగా హెడ్‌కౌంట్ తగ్గడం చూశాం. టెక్ సెక్టార్‌లో మరో 5 నుండి 10 శాతం సిబ్బంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందంటూ వెడ్‌బుష్ నివేదించింది. ఈ కంపెనీల్లో చాలా వరకు 1980 నాటి తరహాలో డబ్బు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ధిక అనిశ్చితికి అనుగుణంగా ఖర్చుపై నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

ఒట్టి రూమర్లే!
ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు స్పందించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పింక్‌ స‍్లిప్‌లు జారీ చేస్తున్నట్లు వస్తున్న నివేదికల్ని ఖండించారు. ఒట్టి రూమర్సేనని కొట్టిపారేశారు.

చదవండి👉 నీ ఉద్యోగానికో దండం.. విసుగెత్తిన ఉద్యోగులు..రాజీనామాల సునామీ?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top