మార్కెట్లోకి మెర్సిడెస్‌ బెంజ్‌ ఎ-క్లాస్‌ లిమోసిన్‌

Mercedes Benz A Class Limousine launched in India - Sakshi

ప్రారంభ ధర రూ.39.90 లక్షలు

ముంబై: మెర్సిడెస్‌ బెంజ్‌ తన కొత్త ఎంట్రీ లెవల్‌ లగ్జరీ సెడాన్‌ విభాగానికి ఏ-క్లాస్‌ లిమోసిన్‌ మోడల్‌ కారును గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.39.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). ఈ మోడల్‌ ఏ200, ఏ200డి, ఏఎంజీ ఏ 35 4ఎంఏటీఐసీ... మూడు వేరియంట్లలో లభిస్తుంది. కాగా, మోడల్‌ ధరలపై జూలై 1 తర్వాత రూ. లక్ష దాకా పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్, డీజిల్‌ ఆప్షన్లలో లభించే ఈ మోడల్‌ ట్రాన్స్‌మిషన్, ఇంజిన్‌లపై కంపెనీ ఎనిమిదేళ్ల పాటు వారెంటీని ఇస్తుంది. భారత్‌లో విలాస కార్లను కోరుకునే కస్టమర్లు ఎంతో కాలంగా ఎదురుచూసిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఏ-క్లాస్‌ మోడల్‌ ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడం తమకెంతో ఆనందంగా ఉందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మారి్టన్‌ ష్వెంక్‌ తెలిపారు.

చదవండి:

భారత మార్కెట్లోకి బీఎండబ్య్యూ 220ఐ స్పోర్ట్‌

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top