మారుతి సుజుకి కస్టమర్లకు హెచ్చరిక!

Maruti Makes Its Largest Ever Recall of Over 180000 Cars - Sakshi

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 1,80,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. భారతీయ ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ రీకాల్ చేయలేదు. ఫ్యూయెల్‌ పంప్‌లో లోపాలు ఉండటంతో పలు మోడళ్లను రీకాల్‌ చేస్తున్నట్టు మారుతి ప్రకటించింది. మే 4, 2018 నుంచి అక్టోబర్ 27, 2020 మధ్య తయారు చేసిన సీయాజ్, ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్, ఎక్స్ ఎల్6ల పెట్రోల్ వేరియెంట్లను రీకాల్ చేస్తుంది.

ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. "వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా, మారుతి సుజుకి మోటార్ జనరేటర్ యూనిట్ తనిఖీ/భర్తీ కోసం వాహనాలను ఉచితంగా స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని నిర్ణయించింది. లోపం ఉన్న వాహన యజమానులకు మారుతి సుజుకి అధికరులు కాల్ చేస్తారని" కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. అప్పటి వరకు వినియోగదారులు నీటితో నిండిన ప్రాంతాల గుండా వెళ్లకూడదు అని, వాహనాల ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల పైన వాటర్ స్ప్రే చేయకూడదని కోరింది.(చదవండి: 3 మిలియన్ల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్!)

అలాగే, 2018 నుంచి 2020 మధ్య కాలంలో కొనుగోలు చేసిన వాహనదారులు తమ ఈ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని కోరింది. కస్టమర్లు తమ వాహనం ఈ జాబితాలో ఉందో చెక్ చేసుకోవడానికి www.marutisuzuki.com(ఎర్టిగా, విటారా బ్రెజ్జా కోసం), www.nexaexperience.com(సీయాజ్, ఎక్స్ ఎల్6, ఎస్-క్రాస్ కోసం) పోర్టల్ లోని IMP. CUSTOMER INFO లింకు మీద క్లిక్ చేసి వేహికల్ ఛాసిస్ నెంబరు (ఎమ్ఎ3 తర్వాత గల 14 అంకెల ఆల్ఫా-న్యూమరిక్ నెంబరు) నమోదు చేయాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top